AADIVAVRAM - Others

చిన్న విషయాలు( సండేగీత )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి వ్యక్తీ తన జీవితంలో గొప్ప మార్పు రావాలని కోరుకుంటాడు. అందుకు ఏదో గొప్ప సంఘటన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.
చిన్న చిన్న విషయాలే జీవితంలో పెద్ద మార్పునకు, గొప్ప మార్పునకు దోహదపడతాయన్న విషయాన్ని మర్చిపోతుంటాడు.
లావుగా వున్న వ్యక్తి అతి త్వరగా బక్కగా కావాలని అనుకుంటాడు. క్రమం తప్పకుండా నడిస్తే ఫలితం ఉంటుందన్న విషయాన్ని మరిచిపోతూ ఉంటాడు.
కొంతమంది బాగా చదవాలని అనుకుంటారు. రోజుకి ఒక్క పేజీ, రెండు పేజీలు చదివితే అది గొప్ప ఫలితాన్ని ఇవ్వదు. కనీసం ఓ యాభై పేజీలన్నా చదవాలి. అవి కూడా మంచి పుస్తకాలు చదవాలి. అది తప్పక వాళ్ల జీవితం మీద ప్రభావం చూపుతాయి.
పెద్ద విషయాలనేవి చిన్న విషయాల నుంచే మొదలవుతాయి.
మంచిగా ఆలోచించడం, ఆశావహ దృక్పథం ఉండటం అవసరమే. అయితే అది ఒక్క క్షణం ఉంటే సరిపోదు. ఒక్క నిమిషం ఉంటే సరిపోదు. రోజంతా ఉండాలి. అప్పుడే దాని ఫలితాలని పొందగలుగుతాం.
చిన్నచిన్న పనులు -
చిన్నచిన్న విషయాలు
మన జీవితంలో ఎన్నో మార్పులని తీసుకొస్తాయి.
మనకు సహాయం చేసిన వ్యక్తికి ఓ చిన్న కృతజ్ఞతా పూర్వక కార్డు ముక్క -మన జీవితంలోనే కాదు. ఆ సహాయం చేసిన వ్యక్తి జీవితంలో కూడా గొప్ప మార్పు తీసుకొస్తుంది.
ఇంకా అలాంటి పనులు చేయాలన్న కోరిక అతనిలో ప్రబలుతుంది.
చిన్న పనులు
చిన్న సంఘటనలు
చిన్న సహాయాలు
కొంతమంది జీవితంలో గొప్ప మార్పుని కలుగజేస్తాయి.
అందుకని వాటిని తక్కువ చేయకూడదు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001