Others

శివారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. నాగ విభూషణా! దయమానంబున దాల్చి మరంపు హుంకృతుల్
సాగగనీక ఆపి, మనసా ఉపకారము సల్ప పెండ్లి యే
క్ష్మా గురు పర్వతాత్మజ నుమా జననిన్ భవదీయ పత్నిగా
రాగము తో నొనర్పమొకొ! రాగ విదూర ! సదాశివా! సదా!

చం. మునులను దేవతల్ దనుజ మూకలు మానవులెల్లవేడగా
మనసిజలైరి కాచితివె మానసమం దురుసత్కృపాబ్ధివై
కనికరమంది నేడు ధర కర్కశ చిత్తముంతోడ ప్రాణముల్
గొను నరరూప రాక్షసుల ఘోర ములలాపు మ్రోవవేడెదన్
*
చదువని వాఁడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గల్గున్
చదువఁగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్దఁ జదువుము తండ్రీ!
భావం: హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో అన్నమాటలివి. చదువురాని వాడు అజ్ఞాని, చదువువల్ల ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోగల్గుతాడు. ‘విద్యానామసరస్య రూపమధికం’ అన్నాడు భర్తృహరి. విద్యావంతుడు జ్ఞాన స్వరూపుడై వెలుగొందుతాడు. విద్య లేకపోతే మూఢుడే కదా.

రాయప్రోలు సీతారామశర్మ 9701764878