Others

అంతా పేరులోనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివతత్త్వ విచారణ
*
ఆలోచిస్తే అన్నీ కరతాలమలకమే! ఒక్కమాటతోనే అన్నీ చెప్పేశారు మన మహర్షులు. కాని మనకే ఓపిక లేక ఆలోచించం.
అదెలాగో చూడండి!

శివమ్
శివమ్ అంటే ఏమిటి? ఎలా వచ్చిందా శబ్దం? యోచించండి! ‘విశ్వమ్’ అనే శబ్దమే తలక్రిందులై ‘శివమ్’గా మారింది. అంటే ఏమిటి? అన్నీ తానై, అంతా తానై ఉన్నవాడు. అనగా అణువణువునా శివతత్త్వం దాగుందని దాని అర్థం. అంతరార్థం. ఇంకా వివరించాలంటే విశ్వమే శివుడు. మహావిశ్వమే మహాశివుడు.
శివలింగం
ప్రపంచమంతా శివలింగానే్న అర్చిస్తోంది. శివుడు లింగస్వరూపుడు. మనమంతా ఏవేవో అర్థాలు చెప్పుకుంటున్నాం, అయోమయంలో పడిపోతున్నాం. కానీ, ఓసారి మీ డాబాపైకెక్కి చుట్టూ పరికించి చూడండి! తల పైకెత్తి చూడండి! ఏం కనిపిస్తోంది! మనపై అనగా మన ధరిత్రిపై ఒక గంటని, లేదా ఒక చిల్లుల గంపని బోర్లించినట్లుగా లేదూ ఆకాశం? అదే మహావిశ్వం. అంటే ఏమిటి? లింగాకారంగా వున్న మహావిశ్వమే మహాశివుడు! మనం మన కళ్లెదుటే వున్న శివున్ని విస్మరించి, ఏ రాతినో, రప్పనో పూజిస్తాం. కానీ విశ్వారాధన చేయడం!
(విశ్వదృష్టి)
అందాకా ఎందుకు?
మన శరీరం ఒక లింగాకృతిలో లేదూ? మనల్ని మనం ఎప్పుడైనా ఈ దృష్టితో చూచుకొంటేగా తెలిసేది?
(ప్రాణి దృష్టి)
మహాలింగోద్భవం
మహాశివరాత్రి రోజున మనం శివాలయానికెళ్తాం, అర్ధరాత్రి మహాలింగోద్భవాన్ని చూడ్డానికని!..
అదేమిటి?..
అర్ధరాత్రి మహాలింగోద్భవం ఏమిటి?..
ఎపుడైనా ఆలోచించారా?
మహాశివుడు మహా విశ్వస్వరూపుడు. ఆపై మహాజ్యోతి స్వరూపుడు. శతకోటి సూర్యప్రభలవాడు. ఐతేనేం?
ఆకాశంలో నక్షత్రాలున్నాయి. అవే జ్యోతులు. అవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. ఒక్కో నక్షత్రం మన సూర్య నక్షత్రానికి వందల రెట్లు పెద్దది. అవన్నీ కలిస్తేనే మహాజ్యోతి! మహా శివస్వరూపమ్!
రాత్రి కాగానే ఒక్కో నక్షత్రం ఉదయిస్తూంటుంది. సూర్యుడస్తమించినా సూర్యప్రకాశం ఇంకా ఉంటుంది కాబట్టి. అర్ధరాత్రివరకల్లానక్షత్రాలు అన్నీ ఉదయిస్తాయి. అంచేత ఆ మహాజ్జ్యోతిని దర్శించుకోవాలంటే అర్ధరాత్రి వరకూ వేచి ఉండాల్సిందే మరి!
ఆ మహాజ్యోతిద్దర్శనమే మహాశివదర్శనం!
మహాలింగదర్శనం!
అదే మహాలింగోద్భవం!
అంతేకానీ, జ్యోతిస్వరూపుడైన శివలింగాన్ని, రాతి రూపంగా ఏ చీకటి గుహలోనో, ఏ గర్భగుడిలోనో దాచి ఉంచి, కాగడాల వెలుగులో చూడడం, చూపించడంకాదు. నాకు తెలీకడుగుతాను,
జ్యోతిస్వరూపాన్ని కాగడాల వెలుగులో చూడడమేమిటండి? మన అజ్ఞానంకాక!
ఈ విషయం తెలిసే కాబోలు, పాశ్చాత్యులు అర్ధరాత్రిదాటగానే క్యాలెండర్ని తేదీని మార్చేసుకుంటారు. అర్థరాత్రిదాటగానే నూత్న వత్సరోత్సవాన్ని జరుపుకుంటారు!

- సశేషం -

- గన్ను కృష్ణమూర్తి