Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమ రామ భజన తప్ప అన్య మెరుగబోడు
అతని నోట రాముని కథ అమృతతుల్యమ్ము

కృష్ణపత్నులు:
మేమెక్కడ? హనుమ ఏడ? ఏమని పిలిచేము?
కడచిపోయె యుగమొక్కటి కనిపించునదెట్లు?

శ్రీకృష్ణుడు:
హనుమయన్న ఎవ్వరంచు మీరలెంచినారు?
మన చుట్టును మనలోపల హనుమయుండు గాదె?

వాయుపుత్రుడతడు కాడె? వాయువతడు కాడె?
అతడు లేక మనముందుమె? అతడు చిరంజీవి!

హనుమ కాదొ వాగ్రూపము హనుమ శ్వాసకాడొ?
హనుమలేక ఆటపాట మనుగడయే కలవో?

విశ్వమ్మును తన గుండెను నిలుపుకొనెడి వాడు
విశ్వజీవకోటి గుండె గోట మీటుచుండు వాడు

సంద్రం తలగడ చేసుకు దాహమ్మనినట్లు చేప
సంద్రంలోనుండి మీరు సంద్రమేదనందురొ?

ప్రతిమనుజున కలడాతడు ప్రతి జీవిని కలడు
నమ్మకున్న నా మాటను- నా వంశిని అడుగుడు

సమ్మోహనం
కృష్ణపత్నులు:
ఇది ఏమిటి విచిత్రమ్ము! ఎటుల వంశి చెప్పు?
వెదురుగడని ప్రశ్నించిన బదులెట్టులనిచ్చు?

అనగానే అతడు నవ్వె- ఆకసమ్ము నవ్వె
రెక్కవిప్పి పక్షులన్ని- ఎగసెను నలుదెసల

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087