Others

కనులముందే అన్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్పభూషణుడు
మళ్లీ ఓసారి పగటి వేళ తలపైకెత్తి చూడండి ఆకసంలోకి! ఏం కనిపిస్తున్నాయి?.. సూర్యుడూ, మేఘాలే కదా? ఆ సూర్యుడే శివుడు. (ఏష బ్రహ్మోచ విష్ణుశ్చ శివః’..కదా! ఉదయమే బ్రాహ్మణోరూపం, మధ్యాహ్నేతు మహేశ్వరః’ కదా?) మన కళ్లెదుటే దివ్యప్రభలతో వెలిగే శివున్ని దర్శించుకోలేక, ఏ శ్రీశైలానికో, కాశీకో, గయకో పరుగులు తీస్తాం మనం!
ఎంతటి అవివేకులం?
ఆ మబ్బులే సర్పాలు. అవి తమ తమ పొట్టలపై ఎలా ప్రాకుతున్నాయో చూడండి! అందుకే అవి ‘్భజంగాలు’. అవి గాలిని మాత్రమే భక్షిస్తాయి. అందుకే గాలిభంజకాలు.. వాటినిండా విషమే. ఇచట విషమనగా నీరమని అర్థం. ఉదయ సాయంకాల సంధ్యల్లో వాటి తలలపై నక్షత్రాలు కూడా మెరుస్తూంటాయి. అవే పాముల తలలపై ఉండే మణులు! అలా విశ్వ స్వరూపుడైన శివునికి మబ్బులే ఆభరణాలు. (చివరికి మహావిష్ణువు శయనించే శేషశయ్య కూడా ఇవేనండోయ్!)
నందివాహనుడు
శివపార్వతులు నందివాహనాన్న అధిరోహించి తిరుగుతూంటారు. శివుడు సూర్యుడు. పార్వతి ఆ సూర్యుని ప్రకాశమే! ఇక నంది వాహనమేమిటి? వారలా తిరిగేది పగటివేళల్లోనే! ‘దినమందే! ఆ ‘దినం’ తలక్రిందులైతే ‘నంది’ సుమండి! అనగా దినమే వారి వాహనమని అర్థం.
అర్థనారీశ్వరుడు
శివుడు విశ్వప్రతీక. మహాశివుడు మహావిశ్వప్రతీక. ఈ భూమీద సగం వెలుతురైతే, సగం చీకటి. ఇదే అర్థనారీశ్వరత్వం. (చివరికి సూర్యుని కడుపులోనూ చీకట్లుంటాయి). అలాగే మహా విశ్వంలో కూడా చీకటి వెలుగులు కలిసే ఉంటాయి. ఇదే మహాశివుని అర్థనారీశ్వరత్వం.
భస్మధారి
శివునికి భూమియే శరీరం. తలయే సూర్యబింబం. అనంత కిరణాలే పాదాలూ, చేతులూను. సూర్యుడు సహస్రపాదుడూ సహస్రకారుడూ కాదా?.. మరి ఈ బూడిద లేదా విభూతి ఎక్కడిది? ఎలా వచ్చింది? ఓసారి భూమివైపు చూడండి! భూమినిండా ఏముంది?.. మట్టియే కదా? అదే భస్మమండీ!
అదెలా? మొదలు సూర్యుని నుండి విడివడిన మండే అగ్నిగోళమే కదా భూగోళం? (సైన్సు) అదే కాలక్రమంలో చల్లబడి, గట్టివడింది. అనగా భూమి నిండా బూదియే కదా? దానినే మనం ‘మట్టి’ అని పిలుస్తున్నాం. ఇపుడు చెప్పండి! ఈ భూమియే శివుని కాయం కాబట్టి, అతని శరీరం నిండా బూడిద ఉన్నట్లే కదా?
ఇక మహాశివుని విషయానికొస్తే, మహావిశ్వమే మహాశివుడు. ఈ మహావిశ్వ పదార్థాలనన్నిటినీ, నక్షత్ర మండలాన్నీ, శూన్యాన్నీ కూడా కలిపి చూడగలిగితే, ఆ మహావిరాట్ స్వరూపమే మహాశివుడు! మనం చూడలేం.
ఊహించుకోవాలి అంతే! అందుకే, దానికి దివ్యనేత్రాలు కావాలంటారు. అదే మూడో కన్ను. జ్ఞాననేత్రం.అది మహర్షులకే సొంతం. అందుకే వారు అన్నీ దర్శించుకొని, పూసగ్రుచ్చినట్లుగా, సవివరంగా మనకు చెప్పారు. ఈ మహావిశ్వమంతా ధూళికణాలతో, దివ్య కణాలతో నిండి ఉంది. చివరికి నక్షత్రాల్లోనూ ధూళి ఉంది. ప్రతి నక్షత్రమూ ఒక కొలిమిలా అనుక్షణం కాలి బూడిదవుతూ ఉంటుంది. అందుకే మహావిశ్వ స్వరూపుడైన మహాశివుడు సైతం భస్మధారియే!

- గన్ను కృష్ణమూర్తి, 9247227087