Others
స్ఫూర్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 March 2019
- డా. కొల్లు రంగారావు
నిత్య జీవితంలో
ఎన్ని కరువులు
చినుకు పడక
చెరువైనా నిండేదెలా
చెలకలు పండేదెలా
కళ్లముందర
ఎన్ని దరువులు
ఎన్ని విన్నా
మరెన్ని చూసినా
మనిషి తనలో తాను
తనపై తాను
తన రెక్కలపై తాను
నీతికి ప్రతి రూపం తాను
ప్రతిబింబం తాను
అవినీతికి ఆమడదూరంలో
అసత్యాలకు
అందనంత దూరంలో
వారసత్వంగా పిల్లలకేం
ఇవ్వగలిగినా లేకున్నా
రొట్టెని ముక్కలు చేసి
తినడం కాక
కడుక్కుని చుక్కలు
చుక్కలుగా
చప్పరించమనే
పొదుపు మంత్రం
తరతరాలకు
తరగని స్ఫూర్తి