Others

కవితోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షిప్తం కాని భావాలను
నిక్షిప్తం చేయడానికి
అక్షరాలు పడే ఆవేదన
ఎంతని చెప్పగలం?
ఊహా విహారం కన్నా ముందే
ఊరేగుతున్న అల్లిబిల్లి ఆలోచనలు
అక్షరాల అంతరిక్షాన్ని
అందుకోవాలని పడే తపన
తలపుల తపోదీక్షకు
తలుపులు తీసే సమయాన
‘కలం’ కాలంతో పోటీపడి
కలలు కంటుంది - కలవరపడుతుంది
ఆ స్వాప్నిక జగత్తులో మత్తులో
కుబుసం విడిచిన కోడెనాగులా
హృదయం లయబద్ధవౌతుంది
జవాబు దొరకని ప్రశ్నలతో
మెదడు మొద్దుబారి సద్దుమణిగి
సరిహద్దు గీతను దాటుతుంది!
సరిగ్గా అప్పుడే - ఓ కవిత
మనసు కొలనులో కమలంలా విరబూస్తుంది
సమాధాన పడిన ఆలోచన
సంధించిన బాణంలా విజృంభిస్తుంది!

- మరువాడ భానుమూర్తి 8008567895