Others
వౌనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 March 2019
- డా. డి.వి.జి.శంకరరావు, 9440836931
ఒక వౌనం యుద్ధ వ్యూహం
ఇంకో వౌనం బుద్ధ ధ్యానం
ఒక వౌనం తీరని వేదన
ఇంకో వౌనం అంతః శోధన
ఒక వౌనం నిగ్రహ ప్రకటన
ఇంకో వౌనం నిరసన ఉద్ఘాటన
ఆగ్రహంపై పరిచిన ఆచ్ఛాదన
వినమ్రంగా దాగివున్న విస్ఫోటన
మిత్రమా -
వౌనం ముద్రల్ని ఛేదించడమంటే
మహా సముద్రాల్ని శోధించడమే
అర్థం కాని అర్ధ్భాగమింకా
అంధకారంలో మిగిలే వుంటుంది
అట్టడుగు పొరల్లో దాగే వుంటుంది.