Others

ఓ వర్ధమాన రచయత్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ నందనవనంలో వికసించిన సుమానివి
అనురాగం, అభిమానం, ఆప్యాయతలతో
తల్లిగా, చెల్లిగా, భార్యగా, బోధకురాలిగా
విద్యుక్త ధర్మ నిర్వహణలో ఓపికకు మరో రూపంతో
సమాజానికి మీ సాహితీ సమర్పణ శ్లాఘనీయం

ఇల్లాలి చదువు యంటికి వెలుగు
ఊరికి వెలుగు, విశ్వమంతా విజ్ఞానపు వెలుగు
బాల్యం నుంచి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దిన
బాధ్యతగల మాతృమూర్తిగా
బాల సాహిత్యాన్నదించిన రచయత్రులు

అవకాశాన్ని అన్ని రంగాలలో అందిపుచ్చుకుంటూ
ఇతోధిక సాహితీ సేవలు చేసే ఇంతులు
‘నాదీ స్వతంత్ర దేశం, నాదీ స్వతంత్ర జాతి’ అని
‘దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా’ అని
దేశభక్తిని నింపిన గాయని గాత్ర స్ఫూర్తితో
స్వాతంత్య్రోద్యమ సమయాన చేసిన రచనలు
సంఘటితం చేసింది దేశభక్తులను.

గ్రామీణ జీవన స్థితిగతుల జానపద సాహిత్యం
ఉద్యమ స్ఫూర్తితో ఉత్తేజాన్ని నింపే రచనలు
రాజకీయ విశే్లషణలతో హేళనాత్మక విమర్శలు
సమాజంలో సంస్కారవంతులుగా తీర్చిదిద్దే
రచనలు చేస్తున్న రచయిత్రులు

మహిళాభ్యున్నతికి దోహదపడే రచనలు
మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చే రచనలు
న్యాయం జరిగినా జరగకపోయినా
మహిళలెడ న్యూనతా భావాన్ని
దుందుడుకు స్వభావాన్ని
దృష్టాంతాలతో ధ్రువపరుస్తూ చిత్రీకరించండి
కేకలు వేసి కేసులు నమోదు చేసినా
ఉన్నత వర్గాల ఉదాసీనత ఉన్నా
రచయిత్రులు రాస్తూనే ఉండండి.

కాలక్షేపానికి కథలు కాదు -
రక్తి కట్టించే రచనలు,
సమకాలీన సమాజ దర్పణంగా
సమాజ రుగ్మతల, అసమానతల
సమూల నిర్మూలనం చేసే రచనలతో
నేటి మహిళా రచయత్రులు, మేటి రచయత్రులుగా
వెలుగొందాలని విన్నపం.

‘రుచి’ చూడబడే పుస్తకాలు కొన్ని
‘నమిలేయబడే’ పుస్తకాలు మరిన్ని
రుచి చూచి, నమిలి, మింగి,
జీర్ణించుకునే విషయాలున్న
రచనలు చేయాలి వర్ధమాన రచయత్రులు.

- వేదం సూర్యప్రకాశం, 9866142006