Others
శాంతి బీజం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 March 2019
- కోడిగూటి తిరుపతి, 9573929483
ప్రకృతి రమణీయ
ప్రశాంత నిలయాన్ని
అతివాద జాత్యహంకారం
స్మశానవాటికగా మార్చింది
పవిత్ర ప్రార్థనా మందిరాలపై
మత విద్వేషం విషం చిమ్మి
మారణకాండను సృష్టించింది
కాల్పులతో నరమేధం సాగించింది
మసీదిప్పుడు మసీదులా లేదు
కుప్పలు తెప్పలుగా
పడివున్నా మృతదేహాలు
రక్తసిక్తమైన క్షతగాత్రుల
ఆర్తనాదాలే తప్ప
ఇప్పుడిక్కడ
ప్రార్థనల్లేవు.. ప్రవచనాల్లేవు...
జాతి వైరం జడలు విప్పిన చోట
మానవత్వం పరిమళించదు
మత విద్వేషం విరజిమ్మినచోట
విశ్వశాంతి విరాజిల్లదు
తరతరాలుగా
విశృంఖలమై విస్తరిస్తున్న
ఈ ఉన్మాద భావజాలానికి
చరమగీతం పాడకుంటే
మానవాళి మనుగడ ప్రశ్నార్థకం
వౌనం వహిస్తూ కూర్చుంటే
ప్రపంచమే అంధకారం
అందుకే
యావత్ పౌర సమాజం
మేల్కొనాల్సిన సమయమిది
మానవ జాతి ఏకమై
శాంతి బీజాలను
నాటాల్సిన తరుణమిది