Others

బి. జయరాములుకు జాతీయ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముళ్లపూడి సూర్యనారాయణమూర్తి జయంతి ‘స్ఫూర్తిదివస్’ను పురస్కరించుకుని విశ్వసాహితి అధ్యక్షులు, ఉస్మానియా వర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ పూర్వ అధ్యక్షులు డా. బి.జయరాములుకు జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా రచయతల సంఘం ‘సాహితీ సమితి’ అధ్యక్ష, కార్యదర్శులు అనంతపద్మనాభరావు, పరమేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. 25-3-2019 సా. 5.30కు వికారాబాద్‌లోని సిద్ధార్ధ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సాహితీ సమితి గౌరవాధ్యక్షులు ఎం.సాంబశివశర్మ, ముఖ్య అతిథిగా జాతీయ సాహిత్య పరిషత్ అఖిల భారత అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, గౌరవ అతిథిగా జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ కార్యదర్శి వడ్లూరి ఆంజనేయులు హాజరుకానున్నారు. పురస్కార గ్రహీతను డా. పి. భాస్కరయోగి సభకు పరిచయం చేస్తారు.