Others

రెండు చేతులతో ఒకేసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రకారుల్లో చాలామంది కుడి చేతితో, అతి కొద్దిమంది ఎడమ చేతితో బొమ్మలు గీయడం వింతేమీ కాదు. అయితే, నెదర్లాండ్స్‌కు చెందిన కళాకారిణి రజసెన్నా వాన్ డేమ్ మాత్రం రెండు చేతుల్లో రెండు కుంచెలు పట్టుకొని ఏకకాలంలో బొమ్మలు వేస్తూ అందరినీ అబ్బుర పరుస్తోంది. కళ్లను అటూ ఇటూ వేగంగా కదిలిస్తూ.. ఒకేసారి రెండు చేతులతో వేర్వేరు బొమ్మలు గీస్తున్నా వాటిలో ఎంతో కళాత్మకత ఉట్టిపడుతోంది. ఇలా ఆమె గీస్తున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు అందుకుంటున్నాయి. రెండు చేతులతో భారీ పెయింటింగ్స్ రూపొందించేందుకు ఒక్కోసారి 40 గంటల సమయం పడుతుందని 25 ఏళ్ల రజసెన్నా చెబుతోంది. వీధుల్లో బొమ్మలు గీసే ఓ చిత్రకారుడిని చూసి స్ఫూర్తి పొందిన ఆమె 16 ఏళ్ల ప్రాయంలో కుంచెలతో సాధన మొదలుపెట్టింది.