Others

ప్రతి పద్య వైవిధ్యభరితం, రంగప్రభూ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా. సి.నారాయణరెడ్డిగారు రచించిన ‘ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు, ప్రయోగములు’ గురించి కవితాభిమానులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఆధునికాంధ్ర కవిత్వాన్ని సాధికారంగా పరిచయంచేసిన ఈ గ్రంథంలో అతి నవ్య కవితా ధోరణులు అన్న అధ్యాయంలో పలువురు కవుల ప్రస్తావనలు వస్తాయి. ఈ సంక్షిప్త ప్రస్తావనల్ని నమోదు చేసే క్రమంలో సినారె ఎంతో జాగరూకతను పాటించారు.
ప్రతిభా సంపన్నులు, నవ్యాభివ్యక్తిని సాధించిన కవుల్ని ఆయన గుర్తించారు. వారిలో గర్రెపల్లి సత్యనారాయణ రాజు ఒకరు. బహుశ సినారె సిద్ధాంత గ్రంథ రచన చేసేనాటికి సత్యనారాయణరాజు కావ్యాలు ప్రచురణ కాకపోయి ఉండవచ్చు. వివిధ పత్రికలలోనూ, తెలంగాణ రచయితల సంఘం కార్యక్రమాల ద్వారాను, మన ప్రాంతీయులకు గర్రెపల్లి సుపరిచితులు. 1950 దశకంలో తనదైన శైలిలో కవితారచన ప్రారంభించిన గర్రెపల్లి ఆనాటి ప్రతిభావంతులైన తెలంగాణ కవులలో ఒకరు.
గర్రెపల్లి కవితా రచనలో విలక్షణత్వం ఉంది. అందుకు జన్మ నేపథ్యం ఒక్కసారి స్మరించుకోవాలి. 20వ శతాబ్ది తెలంగాణ కవితా చరిత్రలో నాలుగైదు దశలు కనబడతాయి. అందులో తొలి దశ 1900-1950 మధ్యకాలం నాటిది. నాటి కవిత్వంలో ప్రాచీన ఛాయలు ఎక్కువ. ఛందోపరమైన పరిమితులు కూడా ఎక్కువే. భాషా ప్రయోగాల విషయంలో సంప్రదాయ విలువలకే పెద్దపీట.
గోలకొండ సంచికలోని పలు రచనలు ఈ లక్షణాల్ని చూపిస్తాయి. అయితే 1950 నాటికే తెలంగాణ కవుల అభివ్యక్తిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కాల్పనిక రీతులు ప్రవేశించాయి. అందులో భాగంగా సౌందర్య దృష్టి, మృదు పద సమ్మేళనంతో కూడిన కవితా సృజనపై దృష్టి పెరిగింది. వానమామలై వరదాచార్యుల వనమాల, భార్గవ రామారావు భార్గావానందలహరి, పల్లా దుర్గయ్య గంగిరెద్దు, దాశరథి అగ్నిధార- ఇవన్నీ నవ్యతను ప్రకటించిన కావ్యాలు. దేవులపల్లి రామాజనురావు, పచ్చతోరణం కావ్యం, సినారె గేయాలు, కవిరాజ మూర్తి వచన కవిత్వం, ఆనాటి నవ్యతకు ప్రతిరూపాలు. ఈ కోవలో చేరిందే గర్రెపల్లి వారి కవిత్వం. గర్రెపల్లి తొలి కావ్యం కలస్వనం, రెండవ కావ్యం స్వప్నఫలం, మూడవ కావ్యం రంగప్రభూ శతకములోనూ కాల్పనిక కవిత్వపు మృదుత్వం కనిపించడం గొప్ప విశేషం.
సంప్రదాయ కవిత్వంలో శతకం ప్రధాన భాగంగా ఉంటుంది. శతకం సంస్కృతంలో కంటే తెలుగులో గొప్ప ప్రతిష్ఠను సాధించిన సంగతి సాహిత్య చరిత్ర చెబుతున్నది. శతకప్రక్రియ తెలంగాణలో వైవిధ్యభరితమైన కవితాలతగా విస్తరించింది. కాకతీయులలో పాల్కురికి సోమనాధుడు నాటిన వచనపు తీగ పరిమళభరితమైన సుమాలని అందించింది.
ఈనాటికి తెలుగులో సంప్రదాయ పద్య కవులకు శతక రచనే ప్రధాన సాధనవౌతున్నది. ఇక్కడొక చారిత్రక వాస్తవికతను కూడా గుర్తించాలి. తెలంగాణలో వెలువడినన్ని శతకాలు మిగతా తెలుగు ప్రాంతాలలో రాలేదు. ఇప్పటికీ శతక పరంపర ఈ ప్రాంతంలో కనబడుతున్నది. ఆలోచనలు, ఆవేదనలు, వేదాంతాలు, ప్రపంచపు సంగతులు- వీటన్నిటిని గురించి స్వీయ వ్యాఖ్యలకు శతకాన్ని మించిన సాధనలేదు. గర్రెపల్లి వారి రంగప్రభూ శతకంలో ఇవన్నీ ఉన్నాయి. పలు శతకాలలో పలుచగా కనబడే లాలిత్యం రంగప్రభూ శతకంలో అడుగడుగునా చిక్కగా నడయాడుతుంది.
నాటి తెలంగాణ కవులలో కాల్పనిక వాదపు ఆధునికత ఎంత గాఢంగా ప్రభావం చూపినప్పటికి వారిలో సంప్రదాయ కవితా ప్రీతి కొంత జీర్ణించుకొనే ఉండేది. దాశరథి, వానమామలై వంటివారి కవితలని సమాస నిర్మాణం ఇందుకు నిదర్శనం. గర్రెపల్లి మంచి పండితుడు. అందుకే అక్షర రమ్యత నిలువెత్తు పోత పోసి ఆరంభ పద్యాన్ని నిర్మించారు. ఈ పద్యాన్ని చదువుతుంటే నన్నయ మహాభారత అవతారికలోని ‘రాజకులైక భూషణుడు’ పద్యం అప్రయత్నంగా గుర్తుకువస్తుంది.
శ్రీ మన్మంజుల కావ్య కల్పిత యశశ్రీ లోల సర్వాగమ
సామ్రాజ్యోజ్వల శీల, విశ్వరచనా వ్యాపార లీలా, రమా
రామ ప్రేమలతాల పాల సుగుణ బ్రహ్మ స్వరూపా నమ
స్తే, మన్మానస రాజహంస, విజయశ్రీ రంగ రంగ ప్రభూ.

- డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి 9866917227