Others

శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌కు మేకోవర్ చేసి.. పురాతన ఫొటో స్టూడియోలో కూర్చోబెట్టి తీసిన స్టిల్‌లా ఉంది కదూ! కానీ కాదు, ఈయన ఫాదర్ సూపర్‌స్టార్. సినీ పరిశ్రమలో గట్స్ కలిగిన ఘట్టమనేని కృష్ణ తొలి నాళ్లల్లో మేకప్ వేసుకున్న స్టిల్ ఇది. అందరిలాగే ఈయనా సినిమా హీరో కావాలన్న బలీయమైన కోరికతో పరిశ్రమకు వచ్చాడు. తన ఊళ్లోనే షూటింగ్ జరుపుకున్న పదండి ముందుకు చిత్రంలో తొలిసారి చిన్న పాత్ర వేసి, తెరంగేట్రం చేశారు. సినిమాలో నటించాలనే కోరిక బలపడటంతో అందరు కొత్తవాళ్లతో నిర్మిస్తున్న ఓ చిత్రంకోసం తన ఫొటోలు పంపించారు. తనలాగే ఫొటోలు పంపిన వందలాది మందిలో తాను ఎంపికై తేనెమనసులు (1965) చిత్రం ద్వారా కృష్ణ పేరుతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కనె్నమనసులు సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. జేమ్స్‌బాండ్ తరహా సినిమా గూఢచారి 116 తరువాత ఆయన వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒకదాని తరువాత ఒకటి చేస్తూ బిజీ నటుడై ఏడాదిలో 18 చిత్రాలు చేసిన హీరోగా రికార్డు సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలుతున్న ఇద్దరు అగ్రనటుల హయాంలోనే తనకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకున్నాడు. తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా పలు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, ఈనాడు లాంటి చిత్రాలు చేయడం ఆయనకే చెల్లింది. అలా సూపర్‌స్టార్‌గా మారిన కృష్ణ మొట్టమొదటి మేకప్ స్టిల్ ఇది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717