Others

పరోపకారానికి ప్రత్యక్ష రూపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరోపకారం చేసేవారిగురించి చెప్పాలంటే మొట్టమొదట చెట్లనే చెప్పుకోవాలి. పరోపకారం కోసం చెట్లు బతికి ఉన్నఫ్పుడూ, కాల గర్భంలో కలిసిపోయేనాడు కూడా ఇతరులకు ఉపయోగ పడుతూనే ఉంటుంది. గాలి పీల్చుకోవాలన్నా, దుర్గంధాన్ని పారద్రోలాలన్నా, తిండి తినాలన్నా, ఎండ నుంచి వాన నుంచి చలినుంచి, క్రూర మృగాల నుంచి తన్ను తాను కాపాడుకోవాలంటే మనిషి చెట్లమీదే ఆధారపడుతాడు. అంతేకాదు మనిషికి సంపూర్ణ ఆరో గ్యం కావాలన్నా, ఏదైనా అనారోగ్యం నుంచి బయటపడాలన్నా చెట్లే ఆధా రం. ఇంకా ఇంకా చెప్పాలంటే మనిషి చనిపోయినా సరే చెట్లపైనా ఆధారపడుతాడు. ఇలా ఆధారపడుతాడు అంటే దానర్థం వృక్షం అంతగా తన్ను తాను మనిషికి అర్పింఛుకుంటోదన్న మాట. దానివల్లనే సృష్టిలో మానవులతోపాటు అధిక ప్రాధాన్యం కలవి వృక్షాలంటారు.
పర్యావరణాన్ని కాపాడడానికి లేదా కాలుష్యనివారణకు మాత్రమేకాదు మనిషి ఎదుగుదలకు, అంటే ఆధ్యాత్మికంగాను, లౌకికపరంగాను కూడా చెట్లు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతాయి. ఈ విషయం మనిషి అర్థం చేసుకోవడానికి దక్షిణామూర్తి మఱ్ఱిచెట్లు కింద కూర్చుని జ్ఞానబోధ చేస్తే, గౌతమబుద్ధునికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం కలిగిందన్నారు. ఆంజనేయస్వామి అరటి చెట్టు మొదట్లోనివసిస్తారని, కదంబం వృక్షంలో లక్ష్మీదేవి నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు వృక్షాల్లో అశ్వత్థాన్ని నేనే అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు.
మనతో పాటే పుట్టిన చెట్ల ప్రాధాన్యం నాటి నుంచి నేటిదాకా అంతా వివరంగా తెలిసినా వాటిపట్ల మనిషికి నిర్లక్షవైఖరినే ఎక్కువగా ప్రదర్శించాడు. నేడు కాలుష్యభూతం మీదికి ఉరికి వస్తుంటే ఇపుడు తటాలున మేల్కొన్నట్టు హరితహారాలు, వృక్షోరక్షతి రక్షితః, చెట్లే ప్రగతికి సోపానాలు అనే నినాదాలు, రెండు లక్షల చెట్లు నాటడం మా లక్ష్యం అంటూ ఒక్కొక్కరూ కదిలి వస్తున్నారు. ఇపుడైనా ఆనందిద్దాము అనుకొనేరు. ఇవన్నీ దృశ్య మాధ్య మాల్లో ఫోటోలు వచ్చేవరకు మాత్ర మే సుమా.. ఆ తర్వాత ఆ చెట్లకు ప్రతిరోజు కనీసం నీళ్ళు అయనా పోసేవారి కోసం కాగడా పట్టి వెతకాల్సి ఉంటుంది.
మరో ప్రక్క చెట్ల గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు శాస్తజ్ఞ్రులు పరిశోధించి వెల్లడిస్తున్నారు. మనపూర్వీకులు ఇంతటి అపూర్వమైన చెట్ల లాభాలను తెలుసుకొన్నవారు కనుక ఆచారాల పేరిట సంప్రదాయాల పేరిట కొన్ని నియమాలను పెట్టారు. వాటిని ఆధారంగా చేసుకొని విదేశీయులే మనవారికన్నా ఎక్కువ పరిశోధనలు చేసి అబ్బురమైన విషయాలను తెలుసుకొంటున్నారు.
మనవారు సంతానం కలుగని వారిని అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెబుతుంటారు. దీనికి కారణం వృక్షానికి ఉండే అరాశక్తి నే అని తెలుసుకొంటే ఆశ్చర్యం కలుగుతుంది. అగ్నిని మనం పరమాత్మ స్వరూపంగా భావిస్తాం. ఆ అగ్నిపొడ వృక్షాల్లోను ఉంటోంది. దాని వల్లనే చెట్లకు ఆరాశక్తి కలుగుతుంది.దీనివల్లనే చెట్లు ఔషధశక్తిని కలిగి ఉన్నాయి. రావిపండ్లలోని విత్తనాలు శుక్రకణాలు పోలి ఉన్నాయ కనుక వీటిని శుద్ధిచేసి ఔషధంగా తీసుకొన్న పురుషుల్లో వీర్యశక్తివృద్ధి పొందుతుందని కూడా శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. మనిషిలోని తామస గుణ ప్రభావం వల్ల ఏర్పడే కోపం, ద్వేషం లాంటి గుణాలు కూడా పచ్చని చెట్లు అరికడుతాయట. ప్రకృతిలో ఏదైనా ఉపద్రవం రాబోతుంటే కూడా చెట్లు వాటి ఆకుల నుంచి, పూవుల నుంచి ఒకరకమైన రసాయనాన్ని విడుదల చేసి మనిషి ని ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా పరిశోధకులు వెల్లడించారు.
ఇన్ని విధాలుగా ఉపయోగపడే చెట్లను రక్షించటం ఇప్పుడైనా మన బాధ్యతగా భావిద్దాం.

- చివుకుల రామ మోహన్