Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచనం- ‘‘నా వంశి చెబుతుందో, లేదో మీరే చూడండి’’!అని చెప్పి, యమునానది ఒడ్డుననే ఉన్న వెదురుపొదల్లోకి మాయమయ్యాడు శ్రీకృష్ణుడు.

పాముపుట్ట దూరినట్లు దూరె పొదలలోకి
ఎందులకో? దేనికొరకొ? ఎవరెరుంగబోరు!

చేరడేసి కనులతోడ వెదకినారు వారలంత
ఒళ్ళంతయు కనులు చేసి మయూరాలు వెదకెనంత

గాలివెదకె, పూవు వెదకె, పరిమళమ్ము వెదకె!
‘‘కృష్ణా! కృష్ణా!’’ యటంచు కృష్ణానది వెదకె!

ఆకాశపు నీలిమలో కలిసిపోయె నేమో!
గాలిలోన గాలివోలె తేలిపోయెనేమో!

మబ్బులందు మబ్బువోలె సాగిపోయెనేమో!
అంబుధిలో అలవోలెను పొంగి పొరలేనెమో!

వచనం- అనుచువారు దిగులు చెందారు. ఇంతలోనే మబ్బుల్లోని మెరుపులా ఓ వెదురు పొదల్లోంచి బయటపడ్డాడు కృష్ణుడు. అతని చేతిలో వెదుళ్ళతో చేసిన వేణువులు! అప్పుడే ఉదయించిన శిశువుల్లా ఉన్నాయవి. వాళ్ళంతా అతనిపైబడ్డారు. ఆయన తలాఒక వేణువునందించాడు. కానీ వాటిని ఎలా వాయించాలో తెలీక, వాటిని అటు త్రిప్పి, ఇటుత్రిప్పి పరీక్షించసాగారు వారు.
కృష్ణపత్నులు:
ఎటుల ఊదుటోయి మురళి! ఎటుల పాడుటోరుూ!
పెదవులతో పలుకునో? చిరునగవులతో కులుకునో?

అనుచు ఒకతె శ్రీకృష్ణుని భుజము పైని వ్రాలెను
ఒక పచ్చని రామచిలుక పూగుత్తుల వ్రాలినట్లు

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087