Others

బుద్ధునితోపాటే బోధనలూ ‘నిర్వాణం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ‘కలియుగం’ ప్రారంభమైందని విజ్ఞులు అంటారు. ఒక్కో యుగానికి ఒక్కో లక్షణముంటుందన్న భావన ఉంది. త్రేతాయుగ లక్షణాలు ద్వాపరంలో కనిపించవు, ద్వాపర యుగ లక్షణాలు కలియుగంలో కనిపించవన్నది జ్ఞాన విశారదుల మాట. కలియుగంలో సత్యం, ధర్మం, నిజం, వాస్తవాలకు ‘గ్రహణం’ పడుతుందన్న మాట విస్తృత ప్రచారంలో ఉంది.
క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరాల నాటికి ‘కలియుగం’ ప్రారంభమై చాలా కాలమైంది. ఆ సమయంలో ఆ యుగ లక్షణాలే ఉంటాయి. ఆనాటి రాజ్యాలలో ఒకటి కపిలవస్తు. ఆ రాజ్యానికి రాజు శుద్ధోదనుడు. అతని భార్య మాయాదేవి. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఒక ‘దివ్యశక్తి’ తన గర్భంలోకి ప్రవేశించినట్టు ‘కల’గన్నది. ఆ (కట్టు)కథకు రాచకుటుంబం పవిత్రతను ఆపాదించింది. ఆ రకమైన ప్రచారమూ జరిగింది. కాని కలియుగంలో అలాంటి కలలకు పవిత్రత లేదని, దైవ సంకల్పమన్న మాటకు మాన్యత లేదని తెలుసుకోకపోతే ఎలా?
ఆనాటి అసంఖ్యాక రాణుల్లో మాయాదేవి ఒకరు. ఎందరో రాణులు కలలు కని ఉంటారు.. ఏవేవో ఊహించుకుని ఉంటారు.. శిశువులకు జన్మనిచ్చి ఉంటారు.. ఇందులో ఆక్షేపించేందుకు ఏమీ లేదు.
అందరు రాణుల, రాజులలో రక్తమాంసాలున్నట్టుగానే మాయాదేవిలో రక్తమాంసాలున్నాయి. వాటిని అంటుకుని ‘అరిషడ్వర్గాలు’, వాటికి జతగా జాలి, దయ, కరుణ, ప్రేమ ఆప్యాయత, ఆదరణ, అభిమాన గుణాలు ఉంటాయి. ఇదంతా మనిషి ‘డిఎన్‌ఏ’లో అంతర్భాగం. మాయాదేవిలో శుద్ధోదనుడిలో, వారి పూర్వీకుల్లోనూ ఇవి కనిపిస్తాయి. ఆ డిఎన్‌ఏ కొనసాగింపు మహారాణి మాయాదేవి ప్రసవించిన శిశువులోనూ ఉంటాయి. ఆమె రాణి అయినప్పటికీ, ఓ ‘దివ్యశక్తి’ తన గర్భంలోకి ప్రవేశించిందని భావించినా ఆమె లుంబినీ వనంలోని ఓ ‘వృక్షం’ కింద మగ శిశువుకు జన్మనిచ్చింది. అతనే సిద్ధార్థుడు. తల్లిదండ్రుల డిఎన్‌ఏను సిద్ధార్థుడు పుణికిపుచ్చుకుని పుట్టాడని వేరే చెప్పనవసరం లేదు. ఆ డిఎన్‌ఏ కనుగుణంగానే అనేక లక్షణాలు పొటమరిస్తాయి.. ఉబికి వస్తాయి. విప్పారుతాయి. ఇందులోనూ వివాదానికి తావులేదు.
యదార్థమైన ఈ అంశాల జోలికి వెళ్ళకుండా, పరిగణనలోకి తీసుకోకుండా సిద్ధార్థుడు పుట్టిన ఘడియలు, తిథి తదితర వివరాలను జ్యోతిష్కులు పరిశీలించి.. బాలుడు పెరిగి పెద్దవాడై వైరాగ్యంతో గొప్ప జ్ఞాని అవుతాడని.. లేదా మహారాజు అవుతాడని చెప్పారట. రాజ్యవిస్తరణ కాంక్ష బలంగా గల శుద్ధోదనుడు ‘వైరాగ్యం’ అనే మాట విని కంపితుడై శిశువు పెంపకంపై అనేక ఆంక్షలు పెట్టాడట. వైరాగ్యానికి దారితీసే పరిస్థితులేవీ తన కొడుకు కంట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడట. శిశువుకు లేదా బాలునికి వైరాగ్య భావనలుండవు... అందులోనూ రాచ కుటుంబంలో జన్మించిన శిశువుకు, బాలునికి ఆ ‘ప్రమాదం’ కనిపించదు. గొప్ప ఆధ్యాత్మిక, భక్తిపారవశ్యం గల కుటుంబంలో జన్మించిన వారి సంగతి... వారి డిఎన్‌ఏ విషయంలో కొంత అనుమానాలున్నా, రాచరికంలో పుట్టిపెరిగే బాలుర విషయంలో ఆ ‘ప్రమాదం’ కనిపించదు. వాస్తవానికి వైరాగ్య భావనలు ఒక వయసు వచ్చాక.. అనేకానేక అనుభవాల అనంతరం ఆ దారిలో పయనించే ఆసక్తి ఏర్పడినప్పుడే అది సాధ్యమవుతుంది. బాలుడైన సిద్ధార్థుడిని అలాంటి వాతావరణం, వైరాగ్యం పొటమరించే పరిస్థితులకు దూరంగా పెంచడం శుద్ధోదనుడి పుత్ర వాత్సల్యం చాటుకొనేందుకే ఉపకరిస్తుంది తప్ప మరొకటి కాదు. తన కొడుకు సిద్ధార్థుడు గొప్ప మహారాజు మాత్రమే కావాలన్న కాంక్ష- అభిమతంతో ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు.
నిజానికి కలలకు, జ్యోతిష్యానికి హేతుబద్ధత, శాస్ర్తియత అప్పుడూ లేదు.. ఇప్పుడూ లేదు. అనేక మంది రాజులు - రాణులు నమ్మినట్టుగానే శుద్ధోదనుడు గుడ్డిగా నమ్మాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఓ వయసొచ్చాక, తన జ్ఞానం తనకొచ్చాక, తన భావనల ఆధారంగా జీవించే స్వాతంత్య్రం లభించాక పంజరంలోంచి చిలుక ఎగిరిపోయినట్టు గతంలో ఎందరో ఏవేవో తీరాలకు యువరాజులు ఎగిరిపోయిన చరిత్ర ఉంది. ఆ కథలు-గాథలు చిరకాలంగా ప్రచారంలో ఉన్నాయి. శద్ధోదనుడి అనుభవంలోనూ ఉండి ఉంటాయి. అయినాగాని పుత్రవాత్సల్యం, రాజ్యకాంక్ష, రాజ్యాధికారంపై గల ప్రేమ- దాహంతో ఆరాజు ‘చైతన్యం’పై పొరలు కమ్ముకున్నాయి. శుద్ధోదనుడు సత్యాన్ని- వాస్తవాన్ని దర్శించలేకపోయాడు.
విచిత్రమేమిటంటే సిద్ధార్థుని పాదాలలో శంఖుచక్రాల ముద్రలున్నాయని, అవి పవిత్రమైనవని ప్రచారమూ జరిగింది. శుద్ధోదనుడు దీంతో మరింత కంగుతిన్నాడు. భయకంపితుడయ్యాడు. అంతేకాని ‘కలియుగం’లో తన బిడ్డ పాదాలకు శంఖు చక్రాలుండటమేమిటని ఆలోచించలేదు. ఓ రాజకుమారుడి పాదాలు అందరి రాజకుమారుల పాదాల మాదిరే ఉంటాయి తప్ప ప్రత్యేకంగా శంఖుచక్రాలు ఎందుకుంటాయి? గుడ్డి నమ్మకం- విశ్వాసం తారస్థాయికి చేరిందనడానకి (చేర్చారనడానికి) ఇదొక నిదర్శనం. తర్కానికి, హేతువుకు, ఆ కాలానికి శాస్ర్తియమనుకున్న అంశమేదీ పరిగణనలోకి తీసుకోలేదు.
నిజానికి అప్పటికే వివిధ చోట్ల విశ్వవిద్యాలయాలున్నాయి. అనేక జీవన పార్శ్వాలపై లోతైన అవగాహన ఉంది. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. లెక్కకు మించిన గ్రంథాలు ఆయా అంశాలపై ఉన్నాయి. లోహాలపై, ధాతువులపై, ఇతర భౌతిక అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యం ఉన్నా.. మాయాదేవి గర్భంలోకి ఓ అద్వితీయ శక్తి ప్రవేశించిందని చెప్పడం... ప్రచారంలో పెట్టడం, ఆ ప్రచారాన్ని రెండున్నర వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా అంతే పవిత్రంగా భావించడం భావదారిద్య్రంగాక పోతే ఏమవుతుంది?
అలాగే జాతకం చూసి వైరాగ్యంతో గొప్ప జ్ఞాని అవుతాడని, ప్రపంచం అతనికి ప్రణమిల్లుతుందని జ్యోతిష్కులు చెప్పడం.. దాన్ని శుద్ధోదనుడు బలంగా నమ్మడం.. ఆయన పరివారం అంతే గాఢంగా విశ్వసించడం, చివరికి రెండున్నర వేల ఏళ్ల అనంతరం ఆ జ్యోతిష్యం నిజమైనందుకు సంబరపడటం విడ్డూరం. వాస్తవికతను వాస్తవంగా చూసే మానసిక స్థైర్యం, ధైర్యం ఉండని కారణం వల్లనే ఈ రకమైన ‘భ్రమ’ల్లో బతకడం జరుగుతుంది.
మనిషి, మనిషి పరిసరాలు నిరంతరం మారుతాయని, స్థల కాలాలకనుగుణంగా పరిస్థితుల్లో ‘మార్పు’ ఉంటుందని విశ్వసిస్తూనే ఈ ‘అపభ్రంశ’ భావనలేమిటి? ఎంతో కొంత ఇంగితంతో మసులుకుని మాటలు చెప్పాలన్న సంగతి విస్మరించి వింత వింత భాష్యాలతో ‘బొంగరం’లా తిరగడమేమిటి?
గత రెండున్నర వేల సంవత్సరాలలో ‘జ్ఞానం’ కాంతి పుంజం కన్నా తేజోవంతంగా వెలుగొందుతోందని, ‘నిద్రలోనుంచి మేల్కొన్న భావన కలగడం’ వర్తమానంలో ‘జ్ఞానం’గా పరిగణించే అవకాశం లేదని తెలియకపోతే ఎలా? భిక్షాపాత్ర పట్టుకుని తిరుగుతూ, ధ్యానం చేస్తూ, ధర్మంలో చెప్పిన వాటిని పాటిస్తూ కోర్కెలను జయించామనుకోవడం, ఆదర్శ సమాజానికి అడుగు దూరంలో నిలబడ్డామని భావించడం... ఎంతటి అమాయకత్వం?
అడవిలో క్రూర జంతువులు, సాధుజంతువులు, పక్షులు- మైనాలు, చిలుకలు, సీతాకోక చిలుకలు ఉన్నట్టుగానే మానవ సమాజంలో ‘అనాది’గా అనేక రకాల మనుషులు కనిపిస్తారు. వారు బుద్ధునికి ముందు కాలంలో ఉన్నారు, బుద్ధుడు జ్ఞాన బోధ చేసిన సమయంలో ఉన్నారు, వర్తమానంలోనూ కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ‘్ధర్మం’ ఉండాలి తప్ప ఒక ధర్మానికి ప్రచ్ఛన్నంగా మరో ధర్మం ప్రతిపాదించాలన్న ‘జ్ఞానం’ ఎప్పటికీ నిలవదు. ఎందుకంటే ‘జ్ఞానం’ అత్యంత వేగంగా రూపాంతరం చెందుతుంది. దాన్ని అందుకోగల వేగం ‘్ధర్మం’లో లోపించడమే కల్లోలానికి కొంత కారణం. బుద్ధుని కాలానికి ఆధ్యాత్మిక రంగం సుసంపన్నంగా కనిపిస్తుంది. ‘్భతిక ప్రపంచం’ సంపూర్ణంగా వికసించలేదు. ఈ నేపథ్యంలో చేసిన బోధనలు వర్తమానంలో భౌతిక ప్రపంచం వెయ్యి రేకలుగా వికసించి, సరికొత్త కక్ష్యలో ఈ ప్రపంచం పరిమ్రిస్తున్న ఈ సమయంలో ఆనాటి బోధనలు పద్ధతులు ప్రాసంగికమని పదే పదే వాదనలు చేస్తే అందులో ‘సత్యం’ ఉందా?... ఆత్మ సంతృప్తి తప్ప! సంతోషం, తృప్తి, ఆనందం అన్నవి ఎప్పుడూ సాపేక్షికాంశాలు. ఈ కీలక అంశాన్ని నేల మాళిగలోకి తోసేసి మానవునికి తృప్తి, ఆనందం, సంతోషం, ఉల్లాసం అష్టాంగ మార్గంలో లభ్యమవుతుందని బల్లగుద్ది వాదించడం మనిషిని అర్థం చేసుకోని తనమే అవుతుంది. మనిషిని బుద్ధుడు సంపూర్ణంగా అర్థం చేసుకున్నాకే ప్రజలకు జ్ఞానం బోధించాడని, ఆ తర్వాత ‘నిర్వాణం’ చెందాడని అంటారు. బుద్ధుని నిర్వాణంతోనే అతని బోధనలూ అదృశ్యమయ్యాయని ఆయన శిష్యులు కొట్టుకు చచ్చారు. ఇది తెలిసి కూడా రెండున్నర వేల సంవత్సరాల అనంతరం తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరించడం ఆత్మహత్యా సదృశం తప్ప మరొకటి కాదు.

-వుప్పల నరసింహం 99857 81799