Others

నచ్చలేదు.. కానీ తప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ప్రాంతం. అక్కడ ఉన్న ఓ చిన్న బార్బర్ షాపులో పురుషుల తలలపై కత్తెర ఆడుతోంది. ఆ కత్తెరను ఆడించేది అబ్బాయి కాదు, ఓ అమ్మాయి. ప్యాంటు, షర్టు వేసుకుని పురుషులకు కటింగ్‌లు, షేవింగ్‌లు చేసేస్తోంది. ఆమె పేరు నేహాశర్మ. 2013లో నేహా తండ్రికి పక్షవాతం వచ్చింది. దాంతో కుటుంబ భారాన్ని నేహా శర్మ తన భుజాలపై వేసుకుంది. కానీ దీనికి ఆమె బాధపడలేదు, కుంగిపోలేదు. కానీ ఇలా తండ్రి వృత్తిని కొనసాగించడం ఆమెకు ఇష్టంలేదు. వేరే గత్యంతరం కూడా లేదు. నేహా శర్మ ఆడపిల్లే కానీ, ఇప్పుడు అబ్బాయిలా బతకాలనుకుంటోంది. తన పొడవాటి జుట్టును కత్తిరించుకుంది. ప్యాంటు, షర్టు వేసుకుంది. పూర్తిగా అబ్బాయిగా మారిపోయి కుటుంబానికి ఆసరాగా మారింది. ఇలా అబ్బాయిలా మారి పురుషుల జుట్టు కత్తిరిస్తున్నందుకు సమాజం ఎన్నో మాటలను అంటోంది. కానీ అవేవీ పట్టించుకోకుండా నేహా తన పని తాను చేసుకుని పోతోంది. ఇప్పుడు తన ముందున్న లక్ష్యం తన కుటుంబాన్ని పోషించడమే.. అందుకే తనకు ఇష్టం లేకున్నా ఈ వృత్తిని ఎంచుకుని కొనసాగిస్తోంది.. నేటి మన సమాజంలో ఇలాంటివారు ఎందరో..