Others

వీటిని చూశారా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క క్షణంలో షూని చెప్పుల్లా మార్చేయొచ్చు. చెప్పులను షూల్లా మార్చేయచ్చు. హీల్స్‌ని ఫ్లాట్స్‌గానూ, ఫ్లాట్స్‌ను హీల్స్‌గానూ మార్చుకోవచ్చు. ప్రతిరోజూ కొత్తగా.. ట్రెండీగా.. ఒకేరకం బూట్లను నాలుగు రకాల డిజైన్లలో వేసుకోవచ్చు. అవే ఫోన్ ఇన్ వన్, టూ ఇన్ వన్ షూ.. చెప్పుల ట్రెండ్..
లోఫర్స్, స్నీకర్స్, కాన్వాస్ హైటాప్స్, కిక్స్.. ఇలా షూస్‌లో బోలెడు రకాలు. కానీ అన్నింటినీ ట్రావెలింగ్‌కు తీసుకెళ్లలేం. ఆఫీసుపనిమీదో, టూర్‌కి వెళ్లేటప్పుడో షూ వేసుకుంటే హుందాగా ఉంటుంది. కానీ ఏదైనా ప్రదేశాన్ని చూడాలన్నా, అటూ ఇటూ తిరగాలన్నా ప్రతిసారీ షూ వేసుకోవాలంటే కుదరదు. అలా అని వెళ్లిన ప్రతిచోటుకీ వెంట చెప్పుల్ని మోసుకెళ్లలేం. సందర్భమూ, వెళ్లే ప్రదేశాన్ని బట్టి మన సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కోసారి ఒక్కోరకాన్ని వేసుకోవడానికి ఇష్టపడతాం. ఫ్యాషన్‌ని బట్టి అయితే వేసుకునే దుస్తులకు తగ్గట్లుగా షూని మార్చడం నేటి యువతకు తప్పనిసరి అయిపోయింది. కానీ అన్ని రకాల షూలని కొనడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం మామూలు విషయం కాదు. అంతేకాకుండా ప్రతీ ప్రయాణానికి వెంట తీసుకెళ్లలేం.. ఈ సమస్యలకు పరిష్కారంగానే జర్మనీకి చెందిన ‘నాట్-2’ కంపెనీ అమ్మాయిలు, అబ్బాయిల కోసం తీసుకొస్తున్నవే ఈ ‘టూ ఇన్ వన్, ఫోర్ ఇన్ వన్ షూ’. ఈ షూస్ మామూలుగా చూస్తే స్నీకర్స్‌లా ఉంటాయి. కానీ దీని సోల్ దగ్గరుండే జిప్పును తీసి పైభాగాన్ని వేరుచేస్తే, కింద చెప్పుల డిజైన్ దర్శనమిస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు షూస్‌ని చెప్పుల్లా, చెప్పుల్ని షూలా మార్చుకోవచ్చన్నమాట. దీంతోపాటు ఈ సంస్థ మరో డిజైన్‌ను కూడా
మార్కెట్లోకి తెస్తోంది. అదే ఫోన్ ఇన్ వన్ షూస్. మామూలుగా లోఫర్స్‌లా ఉండే షూలని బటన్లు, లేసుల సహాయంతో వేరు వేరు డిజైన్లలోకి మార్చుకునేలా విడి తొడుగులు వస్తాయి. అలా ఈ స్టాక్ షూని లోఫర్స్, క్విల్టెడ్ స్నీకర్స్, కాన్వాస్ షూ, కాన్వాస్ హైటాప్‌లా నాలుగు రకాలుగా మార్చుకోవచ్చు. ఇలాంటివే మరో రకం ‘నాయెల్‌కోస్’. అమ్మాయిలకు హీల్స్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిన విషయమే.. కాస్త పొట్టిగా ఉండే అమ్మాయి, పొడవుగా కనిపించడం కోసం తప్పనిసరిగా హీల్స్ వాడుతుంది. హీల్స్ ఫ్యాషన్‌గా ఉంటాయి కానీ వీటితో ఎక్కువసేపు బయట నడవాలంటే కష్టం. అలాంటప్పుడు ఈ నాయెల్‌కోస్ హీల్ ఉంటే వాటి లోపల అమరి ఉన్న పలుచటి ఫ్లాట్స్‌ను బయటకు తీసి వేసుకోవచ్చు. ఇక ఇజ్రాయెల్‌కు చెందిన డేనియాలా రూపొందించిన ‘జె ఒ జె’ టూ ఇన్ వన్ షూ ఒక్క జత ఉంటే వాటికి భిన్నంగా ఉండే మరో మూడు జతలు మన దగ్గరున్నట్లే. ఫ్లాట్ షూలా ఉండే వీటికి మడమ నుంచి చెప్పు కింది వరకూ సులభంగా అమర్చుకునేలా బెల్టులతో సహా మూడు రకాల హీల్స్ తొడుగులు వస్తాయి. వీటిని చెప్పుకు అమర్చుకుంటే హీల్స్ అవడమే కాదు.. కొత్త డిజైనుకి మారిపోతాయి. ఈ తరహావే ఆల్టర్ కంపెనీ టూ ఇన్ వన్ హీల్స్.. వీటిని బెల్టులు తీసేసి, పెట్టీ రెండు రకాలుగా వేసుకోవచ్చు. ఇవేకాకుండా సౌకర్యానికి తగ్గట్టు, మ్యాచింగ్‌కు సరిపోయేలా వేరు వేరు రంగుల్లోనూ, ఎత్తుల్లోనూ ఉన్న హీల్స్‌ను తీసి పెట్టుకునేలా చెప్పుల్ని కూడా డిజైన్ చేస్తున్నారు. ఇవుంటే ఒక్క జతనే ఎన్ని డ్రెస్సుల మీదికైనా మ్యాచింగ్‌గా వేసుకోవచ్చు. రోజూ కొత్తగా, ట్రెండీగా కనిపించవచ్చు. బాగుంది కదూ ఈ ఆలోచన.. ఇంకెందుకాలస్యం.. ఇలాంటి ఓ జతను మీరూ ఆర్డరు పెట్టేస్తే సరి!