Others

ధ్యానమే మార్గము ( శ్రీచక్రము, మానవ శరీరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
H.No. 7-8-51, Plot నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
==================================================================

ధ్యానేనాత్మని పశ్యంతికే చిదాత్మానమాత్మనా
అనే్యసాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే॥
(్భగవద్గీత 13 అధ్యా 25 శ్లోకం)
అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాని ననుసరించి కూడ, ధ్యానయోగం చేత పరమాత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది అని తెలుస్తోంది. కొందరు ధ్యానం చేతను, ఇంకొందరు జ్ఞానాభ్యాసం చేతను ఇంకొందరు నిష్కామకర్మలచేతను, పరమాత్మను తమయందే దర్శింతురని పై శ్లోకార్థము. ధ్యానయోగం యొక్క విశిష్ఠతను గురించి శ్రీశంకర భగవత్పాదులు చెప్పిన విషయాన్ని పరిశీలిద్దాము.
శ్లో॥ ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం
భిత్వా మహాబలిభిరీశ్వర నామమంత్రైః
దివ్యాశ్రీతం భుజగ భూషణ ముద్వహంతి
యే పాద పద్మమిహ శివ! కృతార్థాః॥
(శివానందలహరి-72 శ్లో)
భావార్థం:- భూమిలో దాచి పెట్టబడిన ధనరాశులను గుర్తించడానికి కొన్ని రకాల అంజనాలను ఉపయోగిస్తారు. అదే రకంగా సాధకుడు కూడా ధ్యానమనే అంజనంతో శివ సాక్షాత్కారమనే నిధిని పొందగలడు. ధ్యానాన్ని ప్రధానంగా మూడు అంశాలుగా చూడవచ్చు. దీనిని సాధకునియందలి ‘‘త్రిపుటి’’గా భావించవచ్చు.
1. ధ్యానము:- పటిష్టమైన, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులనే అష్ఠాంగములతో కూడిన ప్రకృష్టమైన యోగస్థితి.
2. ధ్యాత:- ధ్యానయోగాన్ని నియమం తప్పకుండా ఆచరంచే సాధకుడు.
3. ధ్యేయము:- సాధకుడు ఏ ఇష్టదేవతను తన అభీష్టసిద్ధికి ధ్యానమందు గమ్యముగా నెంచుకొనుచున్నాడో అట్టి ఇష్టదేవతా స్వరూపము. పై మూడింటికి మరల కొన్ని ఉపాంగములు కలవు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాము.
1. ధ్యానమునకు మనము ఎంచుకునే ప్రదేశము, వస్తధ్రారణ, ఆసనము మొదలగునవి.
2. ధ్యాతయొక్క క్రమంగా వృద్ధిచెందే అంతఃకరణ స్థితి, ముఖ్యాంశము.
3. ధ్యేయమునకు ప్రధాన ఉపాంగము, ధ్యాన సమయములో తన అంతరంగములో అనుసంధానము చేసుకునే ప్రణవము మొదలైన మంత్రములు.
ధ్యానమునందు ముఖ్యముగా నాలుగు విధముల సమన్వయాన్ని చెప్పారు మన పెద్దలు. అవియేవనగా!
1. పిండాండ- బ్రహ్మాండ సమన్వయము.
2. లింగాత్మ- సూత్రాత్మల సమన్వయము.
3. స్వాప- అన్యాకృత సమన్వయము.
4. క్షేత్రజ్ఞ- పరమాత్మల సమన్వయం.
వీటిని గురించి తెలుసుకుందాం.
1. పిండాండ- బ్రహ్మాండ సమన్వయం:- మన శరీరమందలి ప్రజ్ఞలకు, చోటునందలి పరమాత్మ ప్రజ్ఞకు గల సమన్వయము. మన శరీరమందలి, ప్రజ్ఞలనగా, మనలోని, జీవప్రజ్ఞ అంతర్యామి ప్రజ్ఞ, సత్వరజస్తమోగుణములు, పంచకోశములు, పంచభూతములు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి, వాక్కులు, మూలాధారాది శక్తి కేంద్రములు (చక్రములు) మొదలగునవి. బ్రహ్మాండమునందలి ప్రజ్ఞలు, త్రిమూర్తులు, విష్ణు పదము, బ్రహ్మమానస పుత్రులు (సనక, సనందన, సనత్కుమార, సనస్సుజాతులు) సప్తఋషి మండలము, మున్నగు ప్రజ్ఞలు. బ్రహ్మాండమునందలి ప్రజ్ఞలే మన పిండాండమునందు కూడ వ్యక్తమగుచున్నవి. ఈ సమన్వయమునే యోగమంటారు. బ్రహ్మాండమునందలి శక్తుల ధ్యానము ‘బ్రహ్మవిద్య’ యైనది. మన శరీరమందలి (పిండాండ) ప్రజ్ఞలను ధ్యానించుట. ‘‘ఆత్మవిద్య యనబడినది’’ ఈ రెండింటి సమన్వయమే ‘‘యోగ విద్య.’’
2. లింగాత్మ- సూత్రాత్మ సమన్వయం:- లింగాత్మయనగా ‘‘జీవ ప్రజ్ఞయే’’. ఇది భౌతిక ప్రపంచ సంబంధమైయున్నది. షోడశియను పేరుతో మన శరీరమందు 16 కళలుగా వ్యక్తమగుచున్న వెలుగు ఈమెయే.
ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014