Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నులు వెలుగుల గనులై వీనులు శంఖములాయెను
మనసే బృందావనియై పాట ముక్తి బాటాయెను

మానినెవరొ? మ్రానేదొ?
వేణువేదొ? జాణయేదొ?
ఎవరు ఎరుగరైరి!

నాదమ్మో? వేదమ్మో?
ప్రణయమ్మో? ప్రణవమ్మో?
ఎవరు తెలియరైరి!

వారి పెదవులాశ్రయించి వారి ముద్దులందు కొరకు
కృష్ణుండే వేణువగుచు- వారల చేతుల జేరెనొ?

వచనం- అలా శ్రీకృష్ణుని అనుగ్రహంతో వారి నోట ‘సరిగమలు’ పలికాయి. సంగీతం సాక్షాత్కరించింది. వారానాదఝరిలో ఓలలాడారు. వారు వేణువుల నూదుతూ వాయుదేవునకు స్వాగతం పలుకుతూ, వాయుపుత్త్రుని తమతమ మనసుల్లో కీర్తించారు. ఆహ్వానించారు.
అలా ఆ వేణునాదం మిన్నుముట్టింది. దశదిశల్లో మార్మ్రోగింది. అలా పాడుతూ పాడుతూ, పరవశాన తేలుతూ, కళ్ళుమూసుకున్నారు వారు. ఆపై నెమ్మదినెమ్మదిగా తమనుతాము మరచిపోయి, ఆనందసాగరంలో ఈదులాడసాగారు.
హనుమద్దర్శనం
వచనం- ఒకప్రక్క గలగలపారే యమున! మరోప్రక్క ఘలం ఘలల శ్రీకృష్ణుడు! ఓ వైపు పొంగులువారే సముద్రం! మరోవైపు పొంగులెత్తే ఆనందం! ఒక చెంపన మెత్తని ఇసుక మేటలు! మరో చెంపన సుతిమెత్తని హృదయాలు! ఒక వంక బృందావని! మరోవంక వంకలేని నందనందనుడు! నీలాల నింగి కౌగిట్లో తారకలు!
నీల మేఘ శ్యాముని కౌగిట్లో అష్టపత్నులు.
అది ప్రశాంత నిశాంత వేళ!
ఒక అత్యద్భుత ఆనందహేల!

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087