Others

సహధర్మచారిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలో సగమయ్యాక
తనతో నేనెలా విభేదించగలను
నా ఊపిరి తానై నిలిచాక
తననెలా వదిలెయ్యగలను
బంధాన్ని సూత్రంతో ముడిపెట్టి
ఎదపై పదిలంగా దాచుకొన్నాక
దానె్నలా తుంచెయ్యగలను
నుదిటిబొట్టులో వేకువను నింపుకుని
నా కళళలో వెలుగులు పంచుతుంటే
తననెలా చీకట్లోకి నెట్టగలను
పాపిట సింధూరంతో
తన నుదుటిరాత రాసుకొన్నాక
తన నమ్మకాన్ని నేనెలా వమ్ము చేయగలను
వేదమంత్రాల నడుమ
సహవాసానికి సిద్ధమయ్యాక
నా రాణీవాసాన్ని
తనకప్పగించకుండా ఎలా ఉండగలను?
తొడిగిన కాలిమెట్టెలతో
నా కాళ్ళకు బంధం వేసాక
తనను కాలదన్ని ఎలా పోగలను?
విశే్లషించిన కొద్దీ వెలుగుతున్న విలువలు
చిలికిన కొద్దీ కమ్ముకొస్తున్న
కమ్మటి అనుబంధాలు
ఒక తపన-నిండు సౌభాగ్యం కోసం
ఓ ఆరాటం-పండంటి సంసారం కోసం
ఆమె సహవాసంలో ఓ సంకల్పముంది
సాహచర్యంలో నిబద్ధత ఉంది
సహజీవనంలో ఓ ధర్మం ఉంది
వేదవిహితమైన వివాహ వ్యవస్థ పట్ల
అపార గౌరవం ఉంది
ఆమె జాతి సంస్కృతిని నిలబెడుతోంది
సంప్రదాయాన్ని కాపాడుకొంటోంది
నిండి నిబిడీకృతమైన
విశ్వమంత విశ్వాసాన్ని అంతరంగంలో
పదిలంగా దాచుకుంటోంది..

- కె.రవీంద్రబాబు, 9052778988