Others

ప్రజాజీవితంలో ఆదర్శప్రాయుడు ‘సిపిలా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ నాయకులకు ప్రజలంటే చులకన భావం (ఒక్క ఎన్నికల సమయంలో తప్ప) సహజం. ప్రజలకు మతిమరుపు ఎక్కువ అనేది చాలామంది నాయకుల ప్రగాఢ విశ్వాసం. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను ఆ తర్వాత తమతోపాటు జనం సైతం మరచిపోతారనేది నేతల గట్టి నమ్మకం. అందువల్లనే మన నాయకులు ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇటువంటి రాజకీయ నేతలకు బుద్ధి చెప్పేలా వ్యవహరించారు ఫిన్లాండ్ ప్రధానమంత్రి జుహ సిపిలా. పదవి కన్నా ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలే ముఖ్యమని ఆయన తన పదవికి రాజీనామా చేసి నిరూపించారు.
ప్రజలు అత్యంత ఆనందకరమైన జీవనం గడుపుతున్న దేశాలలో ఫిన్లాండ్‌ది ప్రథమస్థానం. ఫిన్లాండ్ పార్లమెంటుకు 2015లో జరిగిన ఎన్నికలలో జుహ సిపిలా రాజకీయ అరంగేట్రం చేసి ప్రధాని అయ్యారు. ఉన్నత విద్యావంతుడైన ఆయన కంప్యూటర్ రంగ వ్యాపారంలో కోట్లాది రూపాయలు సంపాదించారు. ఫిన్లాండ్ విద్యకు ప్రసిద్ధి. విద్యార్థులపై ఎటువంటి వత్తిడి లేకుండా, ఉత్తమ విద్యను అందించే దేశాలలో ఫిన్లాండ్‌దే అగ్రస్థానం. ప్రతి సంవత్సరం పలు దేశాల నుంచి వేలాది విద్యార్థులు ఫిన్లాండ్‌లో విద్యాభ్యాసం కోసం వస్తారు. ఫిన్లాండ్ వార్షికాదాయంలో సింహభాగం విదేశీ విద్యార్థుల నుంచే లభిస్తుంది.
2015లో జరిగిన ఎన్నికలలో పోటీచేసిన సిపిలా సామాజిక, ఆరోగ్య సంస్కరణలు అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే, సంస్కరణలు అమలుచేయడంలో ఆయన విఫలం అయ్యారు. సాధారణంగా అయితే ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తి ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాయి. సిపిలా అందుకు భిన్నంగా వ్యవహరించారు. వచ్చే నెల 15న ఫిన్లాండ్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో ఆయన- ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యానని బహిరంగంగా ఒప్పుకోవడం గమనార్హం. హామీల అమలులో విఫలం అయినందున తనకు ప్రధానమంత్రిగా కొనసాగే అర్హత లేదని, స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసి, ప్రపంచ రాజకీయాలలోనే నూతన ఒరవడికి నాంది పలికారు. సిపిలా రాజీనామాను ఫిన్లాండ్ అధ్యక్షుడు నినిస్టో వెంటనే ఆమోదించారు.
ప్రస్తుతం మన దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది. ఏప్రిల్ నుంచి సుమారు నలభై రోజులపాటు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలలో గెలుపొందటానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలపై హామీల జడివాన కురిపించడానికి సన్నద్ధం అవుతున్నారు. మన నాయకులు ఎంతోకొంత ‘సిపిలా’ను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు హామీలు ఇస్తే బాగుంటుంది. మన నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చితే భారతదేశంలో మరో స్వర్ణయుగం ప్రారంభం అవుతుందనడంలో సందేహం లేదు.

-పి.్భర్గవరామ్