AADIVAVRAM - Others

మూడు విషయాలు (సండేగీత )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం ఎప్పుడూ ఒకేలా వుండదు.
సంతోషం ఉంటుంది.
బాధా ఉంటుంది.
అందరి జీవితాలూ ఇలాగే ఉంటాయి.
అలా లేవని మనం అనుకుంటూ ఉంటాం.
కానీ
అది వాస్తవం కాదు.
బాగా సంతోషంగా ఉన్నప్పుడు మనం కృతజ్ఞత చెప్పడానికి అవసరమైన మూడు విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి.
జీవితం దుర్భరమైనప్పుడు కూడా మనం కృతజ్ఞతలు చెప్పడానికి అవసరమైన మూడు విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి.
ప్రతి రాత్రి పడుకునే ముందు, ప్రతి ఉదయం లేచినప్పుడు మనం కృతజ్ఞతలు చెప్పడానికి అవసరమైన మూడు విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి.
సందర్భం ఏదైనా
మన పరిస్థితి ఎలా వున్నా,
మనం కృతజ్ఞతలు చెప్పడానికి అవసరమైన మూడు విషయాలని గుర్తుకు తెచ్చుకోవాలి.
మనం ఇష్టం వున్నా లేకపోయినా ఈ పనిని చేస్తూనే వుండాలి.
దీనివల్ల మన సమస్యలు తొలగిపోకపోవచ్చు. కానీ జీవితం పట్ల మన దృక్పథం మారుతుంది. మన వైఖరి మారుతుంది.
కృతజ్ఞతలు చెప్పడానికి భగవంతుడు మనకు ఎన్నో సందర్భాలను ఇచ్చి ఉంటాడు. అందులో మూడింటిని గుర్తుకు తెచ్చుకుంటే చాలు.
నేను కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఎన్నో సందర్భాలు అందులో మూడు సందర్భాలు.
1. శ్రీరాం సార్ 2. భగవంతుడు 3. మంచి పిల్లలు.
ఈ ముగ్గురూ నా వెంట వున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే!

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001