Others

రెజీనా ఓపెన్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌ఎంఎస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రెజీనా.. ‘కొత్త జంట’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రాలతో ఆకట్టుకుంది. 2012లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ ఇప్పటివరకు తొమ్మిది చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శంకరా, జో అచ్యుతానంద, నక్షత్రం చిత్రాల్లో చేస్తోంది. రెజీనా ఒకప్పుడు తీరిక లేకుండా బిజీగా వుండేది. ఇప్పుడు మహా అంటే చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. ఇదేక్రమంలో రోజుకో హీరోయిన్ గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఆఫర్స్ కూడా తగ్గాయి. రెజీనా అందరి హీరోయిన్లలా సినిమాలే కాకుండా షార్ట్ఫిల్మ్స్ కూడా చేస్తోంది. చాయ్ బిస్కెట్ టీమ్ ఆధ్వర్యంలో రానున్న ఓ మైక్రో డ్రామాలో నటించి మెప్పించింది. ఒక హీరోయిన్‌కు, అభిమానికి మధ్య ఉన్న చిన్న గ్యాప్‌లో ఒక అమ్మాయి కూడా ఉంటుందని షార్ట్ ఫిలిం ద్వారా ఫ్యాన్స్‌కు ఓ మెసేజ్ ఇచ్చింది. షార్ట్ఫిల్మ్‌లో నటించిన రెజీనాను ఓ అభిమాని ‘మీరు షార్ట్ఫిల్మ్స్‌లో ఇకముందు కూడా నటిస్తారా?’ అని అడిగితే... ‘మంచి స్క్రిప్ట్ ఉంటే తీసుకురండి చూద్దాం’ అని ఓపెన్ ఆఫర్ ఇచ్చిందట.