Others

లతాజీకి శివాజీ ప్రామిస్( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై టి.నగరు సౌత్‌బోగ్ రోడ్‌లో అతి పెద్ద భవనం శివాజీ గణేశన్‌ది. భవనానికి ముందర ఓ వెయ్యి గజాల అందమైన తోట. జాతి కుక్కలు.. గిన్నికోళ్లు.. వివిధరకాల పక్షులూ... చాలా సందడిగా వుంటుంది. పండగకీ పబ్బానికీ శివాజీ పేదసాదలను తన ఇంటికి పిలిపించుకొని తృప్తికరంగా ఎన్‌వితో(మాంసాహారమంటే చాలా ఇష్టం) భోజనంపెట్టి తోచింది ఇచ్చి పంపించేవాడు. శివాజీ సంగతి తెలుసుగనుక ఆరోజు స్టూడియోల్లో పనిచేసిన లైట్‌మెన్ సకుటుంబంగా విందారగించి వెళ్లేవారు.
లతామంగేష్కర్ ఫేన్ శివాజీగణేశన్.
శివాజీగణేశన్ ఫేన్ లతామంగేష్కర్.
చెన్నై రావడమంటూ జరిగితే.. శివాజీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి వెళ్లవలసిందే. అంతటి అనుబంధం వారిమధ్య వుంది . ఆరోజు ఊహించని విధంగా లతాజీ రావడం జరిగింది. అప్పటికి విందు భోజనాలూ కట్నకానుకలు తతంగాలూ అన్నీ ముగిసిపోయాయి.
సాయంసంధ్య..
శివాజీ హవేలీలాంటి భవనంముందర అందమైన బాల్కనీ వుంది. ఆ బాల్కనీలో కూర్చుంటే.. తోట.. పక్షుల కిలకిలా రావాలు.. పెంపుడు జంతువుల సందడీ.. రోడ్‌గుండా పోతున్నవారి సందడీ కనిపిస్తుంది. ఇట్టే కాలక్షేపం అయిపోతుంది. లతాజీ వచ్చిందంటే ఊళ్లో తెలియకుండా వుంటుందా? తెలిసినా చొరవ తీసుకొని శివాజీ ఇంటికి రాగలిగినవాళ్లు ఎంతమంది వుంటారు. శివాజీ ప్రొడ్యూసర్లూ, కొంతమంది డైరెక్టర్లూ వచ్చి లతాజీని పరామర్శించి విలువైన కానుకలిచ్చి, వారి మన్ననలు పొందారు. లతాజీ కూడా ఆయా ప్రొడ్యూసర్లూ డైరెక్టర్ల సత్‌సాంప్రదాయానికి పులకించిపోయింది.
కాస్సెపు పిచ్చాపాటీ మాట్లాడుకొని.. లతాజీ పాడిన పాటలు తన లైబ్రరీలో ఎన్నున్నాయో వేసి చూపించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఏ పాట ఎందుకు బాగుందో విశే్లషించి చెప్పాడు.
శివాజీ అభిమానానికి లతాజీ పులకించిపోయింది.
ఇక భోజనాల సమయం.. పెద్ద డైనింగ్ టేబులు. శివాజీ కుటుంబం పెద్దది ఒకేసారి ఒక ఇరవైమంది కూర్చొని భోంచేయవచ్చు. ఆరోజు లతాజీతోపాటు శివాజీ మాత్రమే కూర్చున్నాడు. ముందు ఇంట్లోచేసిన దక్షిణాది పిండివంటలూ... ప్రూట్స్ వడ పాయసాలూ పెట్టాడు. తరువాత రైస్ వడ్డిస్తూ.. మీకో అద్భుతమైన వంటకం రుచి చూపిస్తాను అన్నాడు గొప్పగా.
చూపిస్తున్నారుగా! రోజూ మీరు ఇలాగే తింటారా? అనడిగింది నవ్వుతూ.
‘మనసుకి ఆనందంగా వున్నపుడు నేనేం తింటానో ఎంత తింటానో తెలియకుండా తింటాను. దీని ‘రుచి చూసి చెప్పండి’ అంటూ కంచంలో ఒక ఐటెమ్ వడ్డించాడు పరమానందంతో.
‘ఏవిటండీ ఇది. పేరు చెప్పకుండా తినమంటే ఎలా?’ అంది నవ్వుతూనే.
‘దీన్ని ‘మందు’లా కానివ్వండి. మీ గొంతుకి మంచిది!’
‘ఏం మందు?’
‘మందంటే... మందులాంటి వంటకం!’
‘పేరు చెప్పండీ.. ప్లీజ్!’
‘ఇది కోకిల మాంసం... ఎక్కడా దొరకదు... మీకోసం స్పెషల్‌గా చేయించాను!’ వివరణ ఇచ్చాడు.
లతాజీ ప్రతిమలా వుండిపోయింది. పై ప్రాణాలు పైనే పోయినట్లుగా ఫీలయ్యింది.
‘లతాజీ... వాట్‌హాపెండ్... ఎందుకలా అయిపోయారు?’ అన్నాడు శివాజీ కంగారుపడుతూనే.
‘సారీ.. నేనింక ఈ డైనింగ్ టేబుల్ దగ్గరుండలేను!’ అంటూ అక్కడ్నించి లేచి వెళ్లిపోయింది. శివాజీకి అర్థమైపోయింది. లత మనసు గాయపడిందని. లత బాల్కనీలోకొచ్చి కుప్పకూలిపోయింది. కళ్లు అప్పటికే తడిచిపోయాయి.
‘సారీ! మిమ్మల్ని బాధపెట్టాను!’ కంగారుపడ్డాడు శివాజీ.
‘మిమ్మల్నే బాధపెట్టాను. నేనింక హోటలుకి వెళుతున్నాను. ఎలా తింటాననుకున్నారు కోకిల మాంసం? దీనికంటే నా గొంతు కోసినా హాపీగా ఫీలయ్యేదాన్ని!’ కళ్ళు తుడుచుకుంది.
‘నేనూ ఆలోచించలేదు లతాజీ! నేను ప్రామిస్ చేస్తున్నాను మీకోసం.. మీకోసం ఇకముందు ఎన్‌వి ముట్టను... ప్రామిస్!’ అంటూ ప్రామిస్ చేశాడు.
‘దీనికోసం మీరంతా ప్రామిస్ చెయ్యవలసిన అవసరం లేదు. కానీ... నోరూవారుూ లేని ఆ కోకిలను.. ’ మాట్లాడలేకపోయింది లతాజీ.
‘నోరూ వారుూ లేనిది ఒక్క కోకిలే కాదు. మూగజీవాలన్నీ అటువంటివే. ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్య మాంసాలు ముట్టనుగాక ముట్టను అని ఒట్టేశాడు. బ్రతికినంతకాలం నిలబెట్టుకున్నాడు కూడా.

-ఇమంది రామారావు 9010133844