Others

అంచెలంచెలులేని.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అంచెలంచెలు లేని మోక్షం చాల కష్టమే భామిని’ అనే పాటను పింగళి నాగేంద్రరావు శ్రీకృష్ణార్జునయుద్ధం చిత్రం కోసం రచించారు. జయంతి బ్యానర్‌పై నిర్మాణమైన చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించింది కెవి రెడ్డి. ఈ సినిమా అప్పట్లో ఒకవిధంగా జైత్రయాత్రే చేసింది. ఈ పాటను అల్లు రామలింగయ్య, సురభి బాల సరస్వతిలపై హాస్యంగా చిత్రీకరించారు. పాట సన్నివేశం ఏమిటంటే -దేశాటనకు బయలుదేరిన పాండవ మధ్యముడైన అర్జునుడు సుభద్ర ప్రేమానురాగాల కోసం శ్రీకృష్ణుని సలహాపై బలరామరాజ్యంలో ‘యోగీశ్వరుడు’గా ప్రవేశిస్తాడు. ‘చినముని’ వేషంలోవున్న అర్జునుడి ఆంతరంగీకుడిని సుభద్ర చెలికత్తె ప్రేమించి మనసులోని ప్రేమను పాటగా వ్యక్తపర్చే సన్నివేశం! ఆ సమయంలో సురభి ప్రేమిస్తున్నానంటూ అల్లరిపెడుతూ ఉంటుంది. వెంటపడే సురభిని ‘మేం బ్రహ్మచారులం, మునులం, ప్రేమ, పెళ్లి తగదంటాడు. ‘అంచెల అంచెలు లేని మోక్షం చాల కష్టమే భామినీ’ అంటూ ముక్కు మూసుకుని మోక్షంకోసం ధ్యానం చేసుకోమంటే, ఆమె ‘అయినా మనసు కుదురుగ ఉండక మీపైకే మళ్లుతుందని’ ఆమాయకంగా వెంటపడుతుంది. ఆ సన్నివేశంలో అల్లు కంగారుతో పాటు తమాషాగా సాగుతుంది. నాతో నీకు కష్టమేంటే, కష్టమైనా ఇష్టమై కోరి నిలిచానని అచట నిలువక చూపులన్నీ మీపైనేనని ఊరిస్తూ ఉంటుంది. ఎలాగైతేనేం పాట చివరలో ఆమె ప్రేమను అంగీకరిస్తూ మెత్తపడతాడు. ప్రధానంగా ఈ పాటలో అల్లు కంగారుపడే నటన, బిత్తరచూపులు, మెలికలు తిరిగే భంగిమలు హాస్యంగా అందర్నీ అలరిస్తాయి. ఆహ్లాదకరంగా సాగే ఈ పాట అందరకీ నచ్చుతుంది. ఇలాంటి పాటలను చెప్పటంకన్నా చూస్తే కలిగే అనుభూతి ఆనందం వేరు! పెండ్యాలవారు ఈ పాట సాహిత్యానికి చక్కని వినోదపరమైన స్వరాలందించారు. బి గోపాలం, స్వర్ణలత మనసుకు హత్తుకొనేలా గానంచేశారు. గోపాలం ఘంటసాల సంగీత విభాగంలో ప్రధానమైన సహాయకులుగా ఉండేవారు. స్వర్ణలత హాస్య ప్రధాన గీతాల ఆలాపనకు పెట్టింది పేరు. ఎవరైనా ఎప్పుడైనా నిరంతరం ‘యూ ట్యూబ్’లో వీక్షించవచ్చు.

-పీవీఎస్పీ రావు, అద్దంకి