Others

సేద తీరే వేళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగలంతా కలిగిన బడలికతో
శరీరం స్వేదమయమై
మనసేమే మలిన నిలయమై
ఏమీ తోచని సమయాన
తిరిగి శక్తిని పొందేదెలా
మానసం స్వచ్ఛత పొందేదెలా
నే చల్లగా సేద తీరేదెలా

అప్పుడే కనిపిస్తుంది
నా అక్షరం శీతల పవనంలా
ఈ జీవిత చదరంగంలో
పావుల్ని కదిపినట్టు
జీవన నిర్మాణంలో
ఒక్కో ఆలోచనని
ఇటుకలా పేర్చినట్టు
ఒక్కో అడుగూ ముందుకు
ఆచి తూచి వేసినట్టు
హృదయపు లోతుల్లో
కలిగిన భావాలని రాగాలని
విరించినై సాలీడల్లే అల్లిన
నా అంతరంగం నాకు
అందమైన అక్షరాలనిస్తుంది

అప్పుడు మరొక్కసారి
కలం పట్టి శ్రమజీవినవుతా
సప్త రాగాలని ఏడు వర్ణాలని
కలగలిపే ఆ మిశ్రమాన్ని
జీవిత చిత్రపు వస్త్రంపై
రాసే కవితనవుతా
వేసే చిత్తరువునౌతా
సుగంధాల పుష్పాన్నవుతా
సుస్వరాల రాగాన్నవుతా
అసలైన అక్షరాన్నవుతా

- జంధ్యాల రఘుబాబు, 9849753298