Others
గొలుసుకట్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తారాతరంగాల తాత్త్వికాభ
ఉషః ప్రవాహంలో మిళితమైన ఉదయ కమలాన్ని
సంగడించింది
స్మృతులు
నాడీ రక్త నదులీదుకుంటూ
ఒడ్డుమీద ఒత్తిగిలాయి
మరీచి మావి మరంత బిందువుల్ని చల్లుకుంటూ
ప్రభాత రుచుల్ని ప్రంపంచించే క్రమంలో పడ్డాడు
సౌమనస్య సందర్భాన్ని సమీక్షిస్తూ
అర్థాలమీద వాలుతున్న అనిమకాలు
కాళిదాసోపయల్ని నాదాంకితం చేస్తున్నాయి ...
అడవులమీద తేలుతున్న అనిలార్భటి
అక్షరమై ఆత్మలోకి ఒదిగిపోయంది
పక్షి ఒకటి పాట కచేరి మొదలుపెట్టింది
శిశిర యోగ రహస్యాలన్నీ
చైత్రాంకురాలై
శరీరావయనాల మీద శబలతని చిత్రిస్తున్నాయి
జీవాభిధలో దేహం
ఒక రసానంద కార్ముకం
ఎక్కుపెట్టిన బాణమే ప్రాణం
సూర్యుడి స్వగ్రామమైన జ్వాలాదీపంలో
ఈ ఉనికి మొత్తం ఒక శాశ్వత హోమం
చీకటి ననుభవిస్తున్న నిద్రలో
జీవ మండల శశాంక శిల్పాన్ని చౌకళించే
వెనె్నల కండె త్రిప్పుతూ
కలల మగ్గం
జలతారు దుకూలాన్ని నేస్తోంది...
తామస ఖండాల అంతరాళాల్లో
మార్మిక దేవతా సమూహాలు చేసే శబ్దాన
అధివసించే సూక్ష్మశక్తికి లొంగి
చరాచర వస్తుజాలమంతా
ఒక ‘అలౌకికమంపు’లో మునిగిపోయింది
కనిపించే తోటంతా
పక్షి విసిరిన రాగంలో పడి మాయమైంది..
బిందు పతనపు సాతమందున
జన్మదుఃఖం
శ్వాస ప్రతిధ్వనిస్తున్న
పదార్థ రహస్యం
చూపు గాలానికి చిక్కిన
దృశ్య శఫరి
ఊహ తొడిగే ఱెక్క
ఉనికి త్రవ్వే గొయ్య
ఆయుర్జలాన్ని త్రాగుతున్న
మోహ దాహం
ఱెప్పపాటులోని
మహా నిద్ర...