Others

ఉగాది ఊహల ఉయ్యాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. ఆవలిస్తూ అనంతకాల సుషుప్తిలోకి అంతర్లీనమవవబోతూ ‘‘విళంబి’’
ఆరు ఋతువుల ఏకచక్ర రథంలో పరుగు పరుగున వస్తోంది ‘‘వికారి’’
ఆవురావురుమంచు ఆరవతేది ఆకాశము నుండి అవతరించనుంది ‘‘ప్రభవాది’’ మధ్యమున
ఆశలతో అర్రులు చాస్తూ ఆహ్వానిద్దాం ఆనందమైన విచిత్రమైన ‘‘వికారి’’ని

2. మండూకమును భుజించిన కాల భుజంగము భూతములో జర్జరీ భూతమవనుంది
విషనాగు విసర్జించింది కాలకుబుసమును బుడుంగు బుడుంగుమననుంది ‘‘విళంబి’’
శిశిరంలో పండిన ఒక సంవత్సరం పర్ణం నేలరాలి కాలప్రవాహంలో కలయనుంది
చిత్ర విచిత్రముగా చైత్రములో మరలా చిగురించనుంది, కోరికల కోయిలల కూతల మన్మథ ‘‘వికారం’’తో

3. వేప పువ్వుల చేదులు చేదుకొనుచు వాసనల మాలిన్యములను
మామిడికాయల పుల్లదనం ప్రచోదనము చేయు ప్రజ్ఞా పాటవములను
గుడాన్న ప్రీత తియ్యదనం పీయూషమును సహస్రారమున వర్షింపజేయు
ప్రకాశములోని కిరణమై పరవశించు పరమాత్మ ‘ఆకారం’’ లేని నిరాకార ‘‘వికారి’’లో
4. సూర్యోదయ సూర్యాస్తమయ కాలచక్ర భ్రమణం త్రికాలం
త్రికాలంలో దాగియున్నది త్రికోణ రూప చైతన్య శక్తి కాంతి
అంతరంగంలోని అహంకార మమకార మోహాంధకారములను పారద్రోలుము ‘‘వికారి’’లో
విలువైన కాలంబు విషయ భోగముల్లో వ్యర్థము చేయకు ‘వికార’ములతో

5. కామ దహనము చేయవలె మన్మథుని ‘బికారి’గా
సత్కార్యములతో సంచితపాపపుణ్యములను చేయవలె ‘పిచకారి’
పారిజాత పరిమళ పూదూట పరంధామములో పరమాత్మ చింతన చేయవలె పోకిరిగా ‘షికారు’
కోరికల కోరలలో చిక్కక చేరుకో గురుపాదముల చెంతకు ‘వికారి’లో

6. రాగ వితంతువు వికారములు తొలిగి వైరాగ్య సుహాసిని కావలె ‘వికారి’లో
విషయ వాసనల కష్టముల కాయము కాష్టములోకాలి జ్ఞాన పరాకాష్ఠకు చేరవలె
కలికల్మష నివారణం నిర్గుణ నిరాకార పరంధామమునకు ప్రయాణం
సహ్యాద్రి పై సర్వేంద్రియ నిగ్రహం గురుపాద గ్రహణం ‘వికారి ’ లో మన తక్షణ కర్తవ్యం

రూపావతారం లక్ష్మణ మూర్తి 7207074899