Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకసమ్మునేలు వాడు అవని నేల దిగెనంట
భాస్కరుడే అతని చేత భాసిల్లెడు చక్రమంట

అతని గొలువ సీతమ్మయు మరల అవతరించెనంట
ప్రజలెల్లరు ద్వారక నా ప్రభువు భక్తి గొలుతురంట

ఏదీ మాయమ్మ సీత? ఎటనున్నది స్వామీ!
నీరు లేని చేపలాయె నా కన్నులు స్వామీ!

అత జోడ్చుచు తన చేతుల
హనుమ వేడుకొనియె

వచనం- హనుమ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి. జోడ్చిన చేతులు జోడ్చినట్లుగానే ఉన్నాయి! మాట పెకిలి రావడం లేదు.
హనుమ:
ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు-ఎన్నాళ్ళకు దర్శనం!
ఎదిరి చూచి ఎదిరి చూచి కనులు కాయలాయెను!

ఎన్నాళ్ళకు కరుణించితి! నన్ను కటాక్షించితి!
రామా! ఓ రామా! రామా రమణ! శ్రీరామా!

శ్రీకృష్ణుడు:
నిన్ను చూడ మనసాయెను- నిన్ను వినగ కోర్కెలాయె!
అందులకే ఈ అమ్మలు- నిన్ను పిలిచినారోరుూ!
హనుమ:
ఈ అమ్మలు ఎవ్వరో? ఈ తల్లులు ఎవ్వరో?
మాయమ్మే కానరాదు ఏదయ్యా సీతయ్యా?

మరల అడవికంపితివో? అగ్నిని బడద్రోసితివో?
భూమిలోకి నెట్టితివో? ఏది తండ్రి మా సీత?

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087