Others

బొమ్మా!? శవమా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక షాపులోని అద్దాల షోకేసులో ఓ బొమ్మ ఉంది. కొంతమంది దాన్ని బొమ్మ అని, మరికొంతమంది అది శవమని అంటారు. వధువు వస్త్రాల్లో ఉన్న శవమని చాలామంది నమ్మకం. నమ్మబుద్ధి కావడం లేదా.. అయితే వివరాల్లోకి వెళదాం..
ఆ దుకాణంలో అద్దాల మాటున అందంగా కనిపిస్తోంది ఓ బొమ్మ.. అందమైన దుస్తుల్లో, అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోయే ఈ బొమ్మ.. నిజమైన బొమ్మ కాదట. ఆ బొమ్మ షాపు యజమాని కూతురుదని, రసాయనాలను పూసి ఆమెను షోకేసులో బొమ్మలా నిలబెట్టారని చెబుతుంటారు. ఇది మెక్సికోలోని చిహ్వావా ప్రాంతంలోని పస్కులా ఎస్పార్జా అనే వ్యాపారికి చెందిన ఓ దుకాణంలో ఉంది. ఇంతకీ ఇది నిజంగా బొమ్మేనా? లేదా బొమ్మ రూపంలో ఉన్న శవమా? అని అక్కడున్న వారందరూ చెప్పుకుంటుంటారు. 1930లో ఏర్పాటుచేసిన లాపస్క్యులిటా అనే ఈ బొమ్మను చూసి చాలామంది భయాన్ని వ్యక్తం చేసేవారు. అది చూసేందుకు మనిషిలాగానే ఉండేదని, దాని చేతులు కూడా అచ్చు మనిషి చేతుల్లా ఉండేవని వారు తెలిపేవారు. అంతేకాక, ఆమె కళ్లు తమనే చూస్తున్నట్లుగా ఉండేవని, ఒక్కసారి ఆమెను చూస్తే.. రాత్రంతా ఆమె కళ్లు తమని వెంటాడేవని చెప్పేవారు. ఆ దుకాణంలో సోనియా బురుసిగ పనిచేసేది. ఆమె చెప్పిన మాటలు విని చాలామంది భయపడిపోయారు. ఎందుకంటే ఆ బొమ్మకు దుస్తులు ఆమే మార్చేదట. ఎప్పుడు ఆ బొమ్మ వద్దకు వెళ్లినా ఆ అమ్మాయి చెమటలు పట్టేవట. కారణం ఆ బొమ్మ చేతులు నిజమైన చేతుల్లా ఉండేవట. ఆమె కాళ్లపై నరాలు ఉబ్బి ఉండేవట. అది బొమ్మ కాదని, నిజమైన మనిషేనని సోనియా అభిప్రాయం. సోనియా అభిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తున్నారు. కారణం ఆ బొమ్మ చేతివేళ్లను పరిశీలిస్తే మనిషి తరహాలోనే ఉండేవి. వాటిపై చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఉండేవట. ఆ రోజుల్లో వ్యాక్స్ బొమ్మలు తయారుచేసేవారు కూడా ఉండేవారు కాదు. దీంతో అది బొమ్మా? లేదా దుకాణ యజమాని కుమార్తె శవమా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ బొమ్మ ఇప్పటికీ ఆ షాపులోనే ఉంది. అందుకే చాలామంది ఆ బొమ్మ చేతులను చూసి భయపడ్డారట. అయితే ఈ రూమర్లను దుకాణ యజమాని పస్కులా కొట్టిపడేశాడు. అందరూ అనుకున్నట్లు అది తమ కూతురు శవం కాదని వెల్లడించాడు. వెడ్డింగ్ గౌన్లు విక్రయించే పస్కులా కుమార్తె ఓ రోజు బ్లాక్ విడో అనే సాలీడు కుట్టడంతో చనిపోయిందట. ఆ తరువాత కొద్దిరోజులకే ఈ బొమ్మ ఆ దుకాణంలో ప్రత్యక్షమైంది. ఆ బొమ్మను లా పస్క్యూలిటా అని ముద్దుగా పిలిచేవాడు యజమాని. వధువు వస్త్రాల్లో కనిపించే ఆ బొమ్మను చూసి.. చాలామంది నిజమైన మనిషే అక్కడ నిలుచుందని భావించేవారు. దాంతో షాపు యజమాని తన కుమార్తె శవాన్ని రసాయనాల్లో ఉంచి బొమ్మగా తయారుచేసి షోకేసులో పెట్టాడని అంతా అనుకునేవారు. మరి దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటనేది ఆ దుకాణ యజమానికి, అందులో పనిచేసే వ్యక్తులకు మాత్రమే తెలియాలి. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు పోలీసులైనా దాన్ని పరిశీలించాలి కదా అనే ప్రశ్నకు సమాధానం లేదు. అయితే మెక్సికోలో మాత్రం ‘లా పస్క్యూలిటా’ పేరు వింటే చాలు అంతా ఈ బొమ్మ గురించే చెబుతుంటారు. మరి ఈ ఫొటోలను చూపిస్తే మీకేమనిపించింది?