Others

కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుకృతుల మతులు పోగొట్టు ఆలాపనకి
మనసు సుకుమారమై, ముగ్ధయై నిలిచిపోతుందని

కాలం సందడి చేస్తుంది
కొత్త మల్లెపూవు నగవు కన్నా
మేలిమి వలపు చిగురించిన వరుడు
మోవి తేనెల ఘన శబ్దములను పలికి
నునుసిగ్గులొలికించే వధువుని కన్నులతోనే హత్తుకునే
మహాద్భుత ఊహ పూలజల్లువలె కురిపించినట్టు
ఒక కొత్త యుగాదిని, ఒక నూత ఒరవడిని ఆహ్వానిస్తున్నట్టు!

‘కాలం’ ప్రకృతితో సయ్యాటలాడుతుంది!
పెట్టుబడి అలంకారాలు లేన ఆటవిక సుందరి కేరింతలు కొడుతూ
విశ్వగీతాన్ని శక్తిమంత్రంగా స్వేచ్ఛగీతం వినిపిస్తుందనీ
చందమామలో చల్లదనంలా వనప్రియ చందన లేపనాన్ని పూస్తుందనీ..
అలరిస్తుందని..
అలవోకగా పాటై సాగుతుందని..
మురిపిస్తుందని..

‘కాలం’ ఒకనాటిది కాదని తెలియజెప్తుంది
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, ఆకాశం, ప్రవహించే నదులు
నందనవనాలు, అడవి.. అన్నీ అలాగే ఉన్నా
కరుణార్ద్రతతో కూడిన మోహనగానమొకటి
చిరుగాలి కన్నా కోమలంగా తాకి స్వాంతననిచ్చే శీతల సువర్ణ్ధార అనీ
అపరంజి ఇంపు, ముక్తలాస్యము, ముగ్ధమనోహరములని..

‘కాలం’ ఒక ప్రవాహమని జ్ఞప్తి చేస్తుంది!
గతించిన కాలాన్ని జ్ఞాపకాలను ఎంత నెమరువేసుకున్నా
ఉనికిలో తెలియని రహస్యమేదో కనుగొన్నట్లు
ప్రతి పక్షిలోనూ సామగానం నిబిడీకృతమై ఉన్నదనీ
నిరంతర నవ్య యుగాది ఆరంభ క్షణాల్ని, సౌరభాల్ని
ఏనాటికీ పదిలంగా, చిరస్థాయిగా ఉంచగల
కోకిలమ్మను కాలం స్పృశించలేదనీ
కిలకిల నవ్వుతూ నిర్మలమైన పిలుపునిస్తూనే ఉంటుందనీ
విశ్వవ్యాప్తమై భాసిస్తూనే ఉంటుందనీ
కాలం జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది మళ్లీ మళ్లీ!!

- బులుసు సరోజినీదేవి, 9866190548