Others

తిరిగే ఆమని-మనిషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ అత్తవారింటిలో అప్పుడే అడుగుమో
పెడి క్రొత్తకోడలు పిల్లవోలె
భవ్యజీవనగృహప్రాంగణంబున విభా
సిల్లు కోర్కెల రంగవల్లివోలె
షడ్రుచికరవౌ రసాయనంబును పంచ
పుడమి కేతెంచెడి మోహినివలె
పలు సమస్యల ప్రశ్నపత్రమున్ మనకిడ
చేరు పరీక్షాధికారివోలె
కించిత్తుగ ప్రపంచ పంచాంగముల గుట్టు
విప్పవచ్చెడి శాస్తవ్రేత్తవోలె
కష్టాల కడలిలో కరగెడి ప్రజఁబరా
మర్శించు ఒక పెద్దమనిషివోలె
ప్రతి ఓగరును పాశుపతమును వేయ-కా
వలివచ్చు నాయకేశ్వరుని వోలె
ఉగ్రవాద కల్లోలమ్మునూడ్చివచ్చు
‘‘వర్ధమానాభినందన’’ వ్యక్తివోలె
అలవికారాలకె వికారములను గూర్వ
వచ్చు నవ్య ఉగాది! సుస్వాగతంబు॥
తే.గీ॥ బ్రతుకె పచ్చని తరులున్న ప్రకృతియైన
అందమగు ఆశలే చిగురాకులయిన
మనసు కోయిలై కూయగా మనసుపడదె?
వెలుగునీడగా దక్షిణానిలుడు నిలువ
మనిషి ప్రతివాడు తిరుగు ఆమనియె అపుడు॥

- డా॥ రామడుగు వేంకటేశ్వరశర్మ 98669 44287