Others

ఒక చెట్టూ - మరో శిశిర ఋతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా ఇంటి గుమ్మం ముందు
చూపులు వేలాడేసుకుని
ఒక రావి చెట్టూ పలకరిస్తూ
ఋతువుల్ని తనలో మెరిపిస్తుంది.
నల్గురు మాట్లాడే రచ్చబండ నుంచీ
కాస్త దూరం జరిగాక
ఒంటరి నగర జీవనం
ఒక శిశిరంలానే కనిపిస్తుంది.
అంత పెద్ద చెట్టూ ఆకు రాలి మోడువారినా
వసంతాన్ని మరచిపోనట్లు
రేపటి చిగుర్ల కోసం శ్వాస తీస్తుంది.
కాలాన్ని అంకెలతో ముడివేస్తూ
పల్లె వాసన కోసం మనసు పరితపిస్తుంది.
కరెన్సీతో మాట్లాడేవాళ్లని అనుబంధాలకి ముడివేయలేం.
రాలే కన్నీళ్లలో రూపాయలు రాలవు
అనుబంధాలు తెగుతున్న ధ్వనులు తప్ప.
నిన్ను నిన్నుగా ప్రేమించే మనిషి కోసం
శ్వాస నందించే ఒక చెట్టు కోసం
నీ చుట్టూ కలిసి తిరిగే పక్షుల కోసం
ఆప్యాయత కోసం పరితపిస్తూ ఒక చెట్టులో జీవితాన్ని చూస్తూ
ఒక శిశిరం రాలినా కొన్ని వసంతాల కోసం
చూపుల్ని ఆరేయక తప్పదు..!

-గవిడి శ్రీనివాస్ 9966550601