Others

బఱ్ఱెతో ఇంటర్‌వ్యూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ (పాకిస్తాన్) చాలా బిజీ నగరం. అక్కడ ఒక హై రోడ్డుమీద యిటుంచి అటు రోడ్డు మార్జిన్ దాటాలీ అంటే ప్రాణాంతకం. అందుకనే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి వేశారు. దానికి ఎక్కడానికి మెట్లు- దిగడానికి మెట్లు చాలా వున్నాయి. అంచేత జనాలు ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తూ, దాటుతూ వుండగా- ఒక బఱ్ఱెలమంద- అందులో ఆవులూ, ఎద్దులూ కూడా వున్నాయి. తాపీగా, శ్రమపడి ఆ కాలి వంతెన మెట్లన్నీ ఎక్కి, అటుపోయి, మళ్లీ జాగ్రత్తగా అన్ని మెట్లూ దిగుతూ వుండడం చూసిన పాకిస్తాన్ టి.వి విలేఖరి- జియో న్యూస్ సర్వీస్ కోసం ఆ బఱ్ఱెల్ని ఇంటర్‌వ్వూ చేశాడు.
ఆ విలేఖరి పేరు అమీన్ హఫీజ్- ‘‘అమ్మా! మీరెందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిమీద అంత రిస్కు తీసుకుని పోతారు? ఇలా అడ్డంపడి బండ్లన్నింటినీ అడ్డుకుని పోవచ్చు కదా?’’ అని అడుగుతాడు. అవి తలలూపుతూ, ‘‘బాఁ బాఁ’’మంటాయి. అతనే తిరిగి వాటి భాషను తర్జుమా చేసి చెబుతాడు మనకి.
‘‘మేం మనుషులం కాముగా? అందుకని రూల్సు పాటిస్తాం. అది మా జంతువుల అలవాటు’’ అంటాయిట.
ఈ వీడియో పాక్ టి.వి మీదనే కాదు యూట్యూబ్‌లో కూడా జనం విరగబడి చూస్తున్నారు. ఫేస్‌బుక్ మీద కూడా పెట్టాడా విలేఖరి. ‘‘గేదెల సందేశం వింటారా, మనుషులూ?’’ అంటూ.