Others

ఉగాది సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. ఆమని రాకతోఁ దరుల తాంగులు నాట్యము సేయగా ప్రజా
సేమము నెంచి నేతలిక శీఘ్రముగాఁ గృత కృత్యులై మహా
రామము రామ రాజ్యములు రాజిల గావలెనంచు దీక్షతో
సోమునిఁ బోలు వారలయి సూక్తులు గుండెల నింపుకోవలెన్

ఆ.వె. ఆరు రుచుల సారవౌపోసనము వట్టి
కష్టసుఖములందుఁ గలసి వచ్చి
సాటివారి పట్ల సహృదయతను నిల్పు
మికనటంచు ఁ బల్కె రుూ వికారి!

ఆ.వె. కోకిలమ్మ పాట కోట్లాది గుండెగ
వాక్షములనుఁ జొచ్చి పల్లవింప
చేతనత్వమొంది చిగురింపగా వలె
నిత్య జీవితాలు సత్యమిదియు!
కం. వీచే చల్లని గాలులు
పూచే విరితోపులవని పులకించంగన్
శ్రీ చైత్ర లక్ష్మి యిలపైఁ
గాచే వరలక్ష్మి కాగ ఁ గల్యాణములే!

కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262