Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుచు హనుమ సీతకొరకు వెక్కివెక్కి ఏడ్చెను
హనుమ కాడు-అవుడాతడు తల్లి బాయు పిల్లడు

శ్రీకృష్ణుడు:
నీ వెరగవె? నీ తల్లిని? నాసాయము కోరుదే?
తల్లి పిల్ల నెడబాపెడి- వాని నేను కానోరుూ!

వెదకికొమ్ము నీ తల్లిని నీవే వెదకి పట్టుకొమ్ము
అమ్మలలో ఏయమ్మో? నీకునీవె కనుంగొనుము.

హనుమ:
లంకలోనె కనుగొంటిని నా సీతామాతను
లంకేశ్వరు నెదిరించితి రక్కసులను గూల్చితి

నా రాముని సన్నిధిలో- నా తల్లిని కనుగొననే?
నా తండ్రికి నా తల్లికి- నడుమ తెరలు ఉండునే?

అనుచు హనుమ చూచెనంత ఆ యమ్మల వంక
లేగదూడ తల్లికొరకు మందలన్ని వెదకినట్లు

కాని హనుమ తన తల్లిని కనుగొనగను లేకను
వెక్కివెక్కి పాపని వలె మిక్కిలి రోదించెను

హనుమ:
స్వామీ! ననె్నందుకిటుల పరీక్షింపజూతురు?
నా గర్వం, నా సర్వం హరియింపగ జూతురు?

అనుచు హనుమ దుఃఖమ్మున
కుమిలి కుమిలి ఏడ్చెను

అందరి మాటేమొగాని సత్యయొకతె కరిగెను
తనయుని బాసిన దానిగ తానేడ్వగ సాగెను.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087