Others

సుదర్శన క్రియ అంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే సుదర్శన క్రియ అవసరం. మనం పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి శ్వాస లోనికి లోతుగా తీసుకుంటాం. మనిషి జీవనానికి అన్నింటికన్నా ముఖ్యమైనది శ్వాసే. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచడానికి ప్రాణశక్తి చాలా అవసరం. ఎప్పుడైతే ప్రాణశక్తి మనలో ఎక్కువగా ఉంటుందో అప్పుడు శరీరం ఆరోగ్యంగానూ, ఉత్సాహంగానూ, హుషారుగానూ ఉంటుంది. సుదర్శన క్రియ వల్ల శరీరంలోని 90 శాతం వ్యర్థాన్ని బయటకు పంపుతుంది. దీనితో పాటు ఒత్తిడిని కూడా ఊపిరి ద్వారా వెలివేయవచ్చు. శ్వాసలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. సుదర్శన క్రియ అనేది లయగా శ్వాస తీసుకుని దీని ద్వారా శరీరాన్ని, మనసును, భావోద్వేగాలను సామరస్యంగా తీసుకురాగల సులభమైన, శక్తివంతమైన ప్రక్రియ. జీవనంలోని ఒత్తిడిని నిర్మూలించి, అలసటని దూరం చేస్తుంది. కోపం, నిరాశ వంటి చెడు అనుభూతుల నుంచి శరీరాన్ని, మనసును బయటకు తీసుకురాగలదు. అందుకే శ్వాస సరిగ్గా పీలుద్దాం.. సుదర్శన క్రియ రహస్యమైన శక్తి ముఖంపై ఉండే చిరునవ్వును కలకాలం ఉంచుతుంది. కోపం, చికాకు, నిరాశ, బాధల నుండి మనం ఎన్నోసార్లు బయటకు రాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే సుదర్శన క్రియలోని శ్వాస ప్రక్రియ ద్వారా వీటి నుండి ఎలా బయటకు రావచ్చో ఇప్పుడు చూద్దాం.
ప్రతిచెట్టూ ఆకులను రాల్చి కొత్త చిగుర్లతో మళ్లీ మళ్లీ వికసిస్తుంది. ఇది ప్రకృతిలోని లయ. ఇలాగే సంసారంలో కూడా ఒక లయ ఇమిడి ఉంటుంది. అది శరీరానికి, మనసుకు, భావోద్వేగాలతో కూడుకున్న లయ. ఎప్పుడైతే ఒత్తిడి వల్లగానీ, అనారోగ్యం వల్లగానీ ఈ జీవన లయ గాడి తప్పుతుందో, అప్పుడు ఇబ్బందికరంగానూ, అసంతృప్తితోనూ సతమతమవుతూ ఉంటాం. అయితే సుదర్శన క్రియ జీవన లయను తిరిగి తీసుకువచ్చి శరీరం, మనసులోని భావోద్వేగాలను తిరిగి దారిలో పెడుతుంది. దీంతో వారు ఇంట్లోని వారితో మంచి సంబంధాలు కలిగి సంతోషకరమైన జీవనంతో ముందుకు వెళతారు. సుదర్శన క్రియ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లోని ముఖ్యమైన అంశం. ఇది మనలోని శారీరక, మానసిక భావోద్వేగ, సామాజిక ఆనందానికి దోహదపడుతోంది సుదర్శన క్రియ. శ్వాసను, అందులోని రహస్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందరూ రోజుకు 20 నిముషాల విలువైన సమయాన్ని సుదర్శన క్రియ కోసం కేటాయిస్తే శ్వాస శక్తి పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.