Others

ఆవుల కోసం సూపర్ స్పెషాలిటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ క్యాన్సర్ స్పెషల్ వార్డు, ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్ (ఐ.సి.యు) ప్రత్యేకంగా ప్రసూతి వార్డూ కూడా వున్నాయి. అయితే అది కేవలం ఆవులకీ, గోజాతి జంతువులకూ మాత్రమే!
రాజస్థాన్‌లోని జోధపూర్ హైవే మీదున్న నాగౌర్‌లో వున్న రుూ ఆవుల ఆసుపత్రిలో 1600 ఆవులూ, ఎద్దులూ చికిత్సగానీ, ఆశ్రయంగానీ పొందే సదుపాయాలున్నాయి. పెద్ద ఆపరేషన్ థియేటర్ వుంది. వెట్స్ (డాక్టర్లు) రేయింబవళ్ళు సిద్ధంగా వుంటారు. మొన్ననే ఒక ఎద్దుకు పెద్ద ఆపరేషన్ చేసి దాని పొట్టలో నుంచి 77 కిలోల ప్లాస్టిక్ వస్తువులు తీసి దాన్ని కాపాడారు.దిక్కూ మొక్కూ లేని ఆవులూ, ఎద్దులూ, లేళ్లూ, జింకలు, కాశీ ఆవులు అంటారే- అవిటి జంతువులు- అన్నింటికీ యిక్కడ ఆదరణ లభిస్తుంది. ఈ ఆసుపత్రికి 21 ఆవుల అంబులెన్సులున్నాయి. ‘విశ్వస్థరీయ గోచికిత్సాలయం’ అంటారు దీన్ని. దిక్కులేని జబ్బుపడ్డ ఆవులను యిక్కడ తెచ్చి అప్పజెప్పవచ్చును.ఇదంతా కూడా కేవలం దాతలు యిచ్చే డబ్బుతోనే నిభాయిస్తారు. దీనికి ప్రసూతి వార్డులో చిన్న దూడలకీ, పెయ్యిలకీ కూడా ఉయ్యాల మంచాలు వున్నాయి. ‘గోదేవత’గానే ఆవు యిక్కడ ఆరాధింపబడుతుంది. 300 కిలోమీటర్ల పరిధి దాకా అంబులెన్సులు వెళతాయి.
ఈ సూపర్ స్పెషాలిటీ గో చికిత్సాలయానికి రోజుకి నాలుగున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతోందిట! ఇదిగాక రోజుకు 8 టన్నుల గోధుమ నూకతో పశువులకి జావ (కుడితి) తయారు చేసిపెడతారు. గోభక్తులు ఎందరో పశుగ్రాసం, కూరగాయలు, పండ్లు, యిబ్బడిముబ్బడిగా యిస్తారు. గోశిశువులకి ఉయ్యాలలే కాదు- తల్లులకి కంబళ్లు కూడా ఉచితం.
ఈ చికిత్సాలయాన్ని 2008లో స్వామి కుషాగిరి ఓం మహారాజ్‌గారు స్థాపించారు. ఈ సంస్థలోని మొట్టమొదటి ఆవుని - నంద కామధేను’ అని పిలుస్తారు. దీనికో మందిరం కట్టి నిత్యపూజలు, ప్రదక్షిణలు, హారతులూ నడుపుతున్నారు. ఈ ఆసుపత్రి రాజస్థాన్ టూరిస్టులకు ఓ ‘మస్టు’ అయిపోయింది. ‘ఆవును తినడం’ కొందరు ‘జన్మహక్కు’ అంటూ వాదిస్తున్న మేధావులున్న రుూ కాలంలో ఆవు జాతినీ, ఆదుకునే ఇతర పెద్ద సంస్థ భారతదేశంలో వున్నదీ అంటే యింకా సంప్రదాయానికీ, సంస్కృతికీ నూకలు చెల్లలేదన్నమాటేగా!