Others

ఉగాది విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుగాది... యుగ, ఆది అన్న పదాల కలయిక. యుగారంభం అని అర్థం. యుగాదే వాడుకలోకి వచ్చేసరికి ఉగాది అయ్యింది. ‘యుగం’ యొక్క ‘ఆది’ అనే అర్థంలో ఉగాది శబ్దం ఏర్పడింది. ‘‘చాంద్రమానం’ ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమితో కాలం ప్రారంభమవుతోంది. కనుక దానే్న సంవత్సరాదిగా, ఉగాదిగా వ్యవహరిస్తున్నాం. బ్రహ్మ చైత్రమాసంలో శుక్ల పాడ్యమినాడు మొదటి నక్షత్రంలో సూర్యోదయ కాలంలో సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాడు. సృష్టి ప్రారంభం రోజును దేవతల రోజుగా అంటే మన సంవత్సరంగా తీసుకొని సంవత్సరాది పండుగ జరుపుకుంటున్నాం. ప్రకృతిలో కూడా కొత్త మార్పులు ఉగాది రోజునుంచే మనకు కనబడుతుంటాయ. కొత్త చిగుళ్లు, కొత్త పూత- ఇలా అంతా కొత్తదనం కనుకనే ఈ రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటాం. చైత్రశుద్ధ పాడ్యమినాడు ఎవరు దైవ చింతనతో ఉపవాసం ఉండి పంచాంగవేత్తను పూజిస్తారో, వారు ఆ ఏడాదంతా సౌఖ్యాలు పొందుతారట. శాస్తవ్రిధిగా పంచాంగ శ్రవణం, చేసిన వానికి, వినిపించినవారికీ సూర్యునివలన శౌర్యము, తేజస్సు చంద్రునివలన భాగ్యమూ, వైభవమును, కుజుని వలన సర్వమంగళములు, బుధుని వలన బుద్ధి వికాసమూ, గురునివలన గురుత్వము, జ్ఞానము, శుక్రునివల్ల సుఖము, శనివల్ల దుఃఖ రాహిత్యమును, రాహువు చేత ప్రాబల్యము, కేతువువల్ల తన వర్గంలో ప్రాముఖ్యత కలుగుతుంది. ఉగాదినాడు శ్రేయఃకాములందరూ అభ్యంగన స్నానం చేయాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి. పంచాంగ శ్రవణం చేయాలి. షడ్రుచుల ఉగాది పచ్చడి తినాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆయా ఇళ్ళలో కొలువై ఉంటుందంటారు. ఉగాదినాడే కలియుగం ఆరంభమైంది, ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి భగవంతునికి సమర్పించిమనం సేవించడం మన అలవాటు. సంప్రదాయం. ఉగాది పచ్చడి సేవనం వల్ల జీవితంలో ఏర్పడే ఒడడిదొడుకులను తట్టుకునే శక్తితో పాటు, శరీరంలో జరిగే మార్పు లకు తట్టుకునే ఆరోగ్య పరమైన శక్తికూడా ఈ పచ్చడిలో ఉన్న ఔషధ గుణాలు వల్ల పుష్కలంగా మనకు లభిస్తాయని అంటారు. -

- కె. వాణిప్రభాకరి