Others

ఆశాగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగాది ఉత్సవమా
శ్రీ వికారి నామ వత్సరమా
అందుకో మా
ఆశయాల తోరణం
స్వాగతాల ఆభరణం

నవ నాగళ్లతో
పుడమి పులకరిస్తూ
పచ్చదనం కిసలయించే
కర్షక వసంతాన్ని
మాకు ప్రసాదించు

అతివృష్టి అనావృష్టి లేక
పంటచేతి కందే
హరిత విప్లవాన్ని
రమణీయ హేమంతాన్నీ
మాకు ప్రసాదించు

రక్తపాతాన్ని ముద్దాడని
శాంతిసౌధాల ధన్యభూమిని
‘నిర్భయ’ మరణాలు లేని
మానవీయ ధరిత్రిని
మాకు ప్రసాదించు

అందరూ ఒక్కటేననే
సుందర భావాల నందన వనాన్ని
నిండు మనసుల ఆనంద భువనాన్నీ
ద్వేషాలు మోసాలు లేని
వసుధైక కుటుంబాన్ని
కుచ్చితాలు కుతంత్రాలు లేని
మానవతా సుగంధాన్నీ
మాకు ప్రసాదించు..!

- కటుకోఝ్వల రమేష్, 9949083327