Others

కొత్త వత్సరానికి ఆహ్వాన గీతిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. విళంబి కాలకాళిందిపై కదము తొక్కె
వికారి ఉధృతముగా ఉత్తుంగ తరంగముతో ఉద్భవించె
విరించికైననూ తప్పునా కాలనాగు కాటులు
విచారించి దత్త కాలభైరవుని కాళ్లపైబడుట తక్షణ కర్తవ్యం

2. ప్రభవలు విభవలు కాలము తిను ‘పులి‘హోర’ములు
యుగ యుగములు ‘వికారి’ అనంత కాల తత్వ ‘వింత’ పంచాంగం
క్షణ క్షణం క్షీణించు విసర్జించు ‘కాలసర్ప కుబుసం’
సద్గురు కృపాకటాక్ష వీక్షణం కొరకు తపస్సే మన తక్షణ కర్తవ్యం

3. తెలుసుకో ఈ జీవితం బుద్బుద ప్రాయం ఆగదు కాల చక్ర భ్రమణం
తగ్గించుకో నీ కోరికల భ్రమర హుంకారం
పెంచుకో నీ ప్రణవ నాద ఓంకార ఝంకారం
జుర్రుకో దత్తదేవుని పాద పద్మముల జ్ఞానామృత కింజల్క రసాపానం

4. శునకా రవములు కాలభైరవుని హెచ్చరిక కేకలు - మేలుకో
కుక్కుట కూతలు కాల గడియారం అలారం మోతలు - తేరుకో
దాపురించినది అస్తమయకాలం - క్రమ్ముకుంది గోధూళికా సమయం కనువిప్పు కలిగించుకో
జీవుని మేలుకొలుపు గురుదేవుని పలుకులే నీకు సుప్రభాతములు -మేలుకో

5. జననం మరణం పునరపి జననం ఏమున్నది గర్వకారణం ? ఏది జీవిత గమ్యం?
కాయం కాటికి పోవుట తథ్యం - కరుణించడు నినె్నపుడు యముడు-
అకాల మరణం బ్రహ్మరాతల కారణం
భ్రమించుచుండు బ్రహ్మాండము - పరిక్రమించు పిండాండములు అనుక్షణం
జాగు చేయక దత్తుని పాదాలపై బడి మ్రోగించు మోక్ష ఢిండిమలు పదేపదే

6. యుగయుగములు సాగిపోయెను - ఎక్కడికి పోయాయో ఏమో!
కాల జననం పతనం ఏమో అర్థం కాని సృష్టిలో అత్యాశ్చర్యం
కొలతల కందని కాలప్రవాహం తెలిసీ తెలియని అయోమయం
వందనం వందనం పాతకాలానికి - స్వాగతం నూతన సంవత్సరానికి సుస్వాగతం!

- రూపావతారం లక్ష్మణ మూర్తి , 7207074899