Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా రాముని ఆన వాని వాలమ్మున బంధించెద
వానితోడ వానికొంప తగులబెట్టి వచ్చెద

అనియెనపుడు హనుమంతుడు
అగ్ని పుక్కలించుచు
కృష్ణపత్నులు:
మేమే నిను పిలిచినాము! మేమె నిన్ను తలచినాము
నీ నోటను శ్రీరాముని కథను వినగనెంచినాము
హనుమ:
నా రాముని తోడ మీరలున్నవారు కారె?
తల్లులార! రాముని కథనే జెప్పుట ఏమి?

రాముండే రాముని కథ వినదలచిన యట్లు
సీతమ్మే సీతగాథ వినగోరినయట్లు

మీరె నన్ను రామకథను తెలుపుమనుట ఏమి?
గుండె నొలిచి పాదమ్ముల నుంచుమందురేమి?

ఐన నాదునోము పండె- మీ కోరిక కతమున
నా సీతారాములను నే గంటని మరల

అనుచు హనుమ ఆ సత్యాకృష్ణుల చుట్టును తిరిగేను
అతని వెంట తోకయట్లు భామలు తిరిగేరు

రామలెల్ల హనుమతోడ రామభజన జేసిరి
కృష్ణుడున్ను రామ భజనచేసి మురిసినాడు

హనుమ పాడె హనుమతోడ ఆకసమ్మె పాడె!
చెట్టు పాడె! పుట్ట పాడె! పాడె చెట్టుపైని పిట్ట!

పిట్ట పాడె! పుట్ట పాడె! పుట్టలోని పాము పాడె
గిరులు పాడె! తరులు పాడె! పాడె దిక్కులన్ని

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087