Others

కొత్త కోయిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విళంబిలో తీపి చేదులను చవి చూసి
కొత్త వసంతానికి చిగురు తొడుక్కున్న ఒక కోయిల
పిలవకనే ఇంటికి వచ్చేసింది!
ఇదేంటంటే? మనవారే కదా
నేను శుభం పలుకాలి కదా! అంది
భవిష్యత్తు భరోసా ఇస్తా
అంటూ ఆశపాటొకటి ఈ కొత్త కోయిల
రాగరంజితంగా ఆలపిస్తోంది
మనిషిలోని వికారగుణాల ఏరివేతకు
నాందీసూచకమే ఈ కొత్త ‘వికారి’ అంటోంది
నాగరికత మోజులో సర్వం మరిచిన మనిషిని
సంస్కృతీ సంప్రదాయాలు
నీలో జీర్ణించుకునే ఉన్నాయి
వాటిని వెలికి తీయాల్సిందే
మానవత్వం వికసించాల్సిందే నంటోంది
దేశమంతటా భిన్న భిన్నపేర్లతో
తనని తలిచినా
భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని
గుర్తించానంటూ
తనతో కలసి పదం పదం కలిపి
కొంగొత్త లోకానికి తెరతీయమంటోది
ముళ్లు ఉన్నాయని పూలు పారేసుకుంటామా?
అట్లాగే!
మనిషిలోని దుష్టత్వాన్ని దూరం చేసి
మంచితనాన్ని మానవత్వాన్ని
తట్టి లేపుదాం! కలసిరండి అంది
అందుకే కొత్తకోయిల ఆశపాటకు
సన్నాయ మేళాన్ని పిలిచి
అక్షరాల గవాక్షాలను తెరిచేసి
కవిలోకం గొంతు సరిచేసేసి
కొత్త కోయిలకు
వంతపాట మొదలెట్టేసింది!

- ప్రసన్నాంజలి