Others

తొలిపండుగ ‘ఉగాది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగలు మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకూ, ఆచారాలకూ కేంద్ర బిందువులు. సమాజంలో ప్రతి కుటుంబంవారు పండుగలు జరుపుకుంటారు. పండుగలు మానవులకు కొత్త ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. బంధువులు, మిత్రులు అందరూ కలుసుకోవడానికి పండుగలు ఉపకరిస్తాయి. తద్వారా ప్రతిమనిషి మధ్య ఐకమత్యం ఏర్పడుతుంది. దీనితోపాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఏర్పడుతుంది. అట్లా ఆధ్యాత్మికచింతనను కలిగించడమే మన పండుగల పరమ ప్రయోజనంఅనీ అంటారు.
ఉగాది ప్రత్యేకత
వసంతం ఋతువులో మొదటిది. చైత్రం మాసాల్లో మొదటిది. శుక్లపక్షం పక్షాల్లో మొదటిది. అలాగే పాడ్యమి తిథుల్లో మొదటిది. మొదలు అంటే తొలిది లేదా ఆది. ఇన్ని ఆదులు కలిసే రోజు ఉగాది. ఉగాది వికృతి యుగాది ప్రకృతి. ఉగాది సంవత్సరానికి తొలి పండుగ. ఉగాదికి సంవత్సరాది అని, ప్రకృతి పండుగ అని సంవత్సరేష్టియని పేర్లున్నాయి.
ఉగాది పండుగలో కొన్ని ప్రత్యేకతలు
ఉగాది పచ్చడి ప్రత్యేకత : ఉగాది పండుగ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. అవి తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం. ఇన్ని రుచులు కలిసిన ఈగాది పచ్చడి ఆస్వాదనీయమై ఉంటుంది. ఈ ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలోని సుఖ దుఃఖాలకు ప్రతీకలు. ఈ జీవన తత్త్వం ఎలా ఉన్నా వేసవి ఆరంభంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడంవల్ల మన శరీరంలోని వాత, కఫ, పిత్త దోషాలేమైనా ఉంటే పోతాయంటారు. వేపపువ్వులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. క్రిముల్ని చర్మరోగాల్ని నివారించే శక్తి ఉంటుంది. మామిడి ముక్కలు రక్తప్రసరణ దోషాలను నివారిస్తాయి. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్తబెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతువాపు వంటి దుర్లక్షణాలను అరికడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా చూసే పని ఉప్పుది. . అలాగే వీటితోపాటు చెరకు ముక్కలు, అరటిపండును కూడా కలుపుతుంటారు కొందరు.
పంచాంగ శ్రవణం: ఉగాది నాడు విధిగా పంచాంగ శ్రవణం ఉంటుంది. ఇది మన ఖగోళ శాస్ర్తియ దృక్కోణానికి అద్దంపట్టే సంప్రదాయం. ఇందులో ఐదు అంగాలుంటాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు.
ప్రసాదాన ప్రారంభం: ‘ప్రప్ర’ అంటే చలవపందిరి. ప్రసాదానం అంటే చలివేంద్రం పెట్టి దాహం తీరే తీర్థాలు ఇవ్వడం. అదీ ఈ రోజు ప్రారంభిస్తారు.
ఛత్ర చామరాల సేకరణ: చైత్రం నుంచీ ప్రత్యక్ష నారాయణుడి కిరణాల పదును పెరుగుతుంది. కాబట్టి గొడుగులు, విసనకర్రలు సేకరించుకుంటారు.
వసంత నవరాత్రి ఉత్సవం: ఉగాదితో ప్రారంభించి తొమ్మిది రోజులవరకూ ఈ వేడుకల్ని జరుపుతారు. ఏడాది పొడవునా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమి తర్వాత వచ్చే దశమి వరకూ రాముడిని వేడుకుంటూ వీటిని నిర్వహిస్తారు.
ఉగాది కార్యక్రమాలు
ఉగాది నాడు నూతన సంవత్సర ఆరంభ సూచనగా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు ఏర్పాటుచేస్తారు. వ్యాపారస్థులు వ్యాపార లావాదేవీలను ఆ రోజున ప్రారంభిస్తారు. ఇంకా ప్రజలు నాటకాలు, నృత్యాల్లాంటి మనోరంజన కార్యక్రమాలు, అలాగే నూతన సాంస్కృతిక కళా సంస్థలు ఉగాదినాడు శాస్త్రోక్తంగా ప్రారంభించబడతాయి. కవి సమ్మేళనాలతోపాటు అష్టావధానాలు, శతావధానాలు కొన్నిచోట్ల ఏర్పాటుచేస్తారు. ఈ విధంగా ప్రజలందరూ ఉగాదికి స్వాగతం పలుకుతారు.
ఉగాది పండుగ జరుపుటకు కొన్ని చారిత్రక ఆధారాలు
- శక పురుషుడైన శాలివాహన చక్రవర్తి చైత్రశుద్ధ పాడ్యమినాడు పట్ట్భాషిక్తుడైనాడని, అదే ఉగాది అనేది ఒక చారిత్రక కథ.
- విక్రమార్క శకం ప్రారంభమైన రోజు ఉగాది అని మరొక చారిత్రక కథ.
- విశ్వవిఖ్యాతి చెందిన గణిత శాస్తవ్రేత్త ‘వరాహమిహిరుడు’ చైత్రశుద్ధ పాడ్యమినాడే తన తొలి పంచాంగాన్ని ఆవిష్కరించాడు.

-కొలిపాక శ్రీనివాస్ 9866514972