Others

ఏనుగులున్నాయి జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులోని వాలయార్ అడవి ప్రాంతంలో రైలుబండ్ల క్రిందపడి చనిపోయే గజరాజులు ఎక్కువైనాయి. రాత్రిపూట రుూ ప్రాంతంలో కేరళ, తమిళనాడు సరిహద్దులు దాటుతూ మూడున్నర కిలోమీటర్లు దూరం ఎన్నో రైలు బళ్లు పోతూ వుంటాయి.
‘‘ఏనుగులను కాపాడుకునే నిమిత్తం అన్ని రైలు బండ్లు గంటకి 15 కి.మీ వేగంతో మాత్రం పోవాలి’’ అంటూ కేరళ ప్రభుత్వం రైల్వే పాలక్కాడ్ డివిజన్ అధికారుల్ని కోరింది. ‘‘ఏనుగులు చెప్పినా మాట వినువు. ట్రాక్ దాటరాదు అంటే వాటికి అర్థం కాదు కనుక’’ అంటారు అడవి అధికారులు.
‘‘ఐతే, చెన్నై, న్యూఢిల్లీ, కాశ్మీర్‌లకు పోయే సుదూర సూపర్ ఫాస్ట్ రైలుబండ్లు రాత్రుళ్లే పోతాయి. వాటి స్పీడు తగ్గిస్తే మొత్తం వ్యవస్థ అంతా అస్తవ్యస్తమయిపోతుంది’’ అంటారు రైల్వేవారు. దానిమీద రాజకీయ నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంటు అంటున్నారు. పోరాటం సాగుతోంది.
ఏనుగులు గెలుస్తాయో? రైళ్లు గెలుస్తాయో చూడాలి మరి!