Others

భావనయే పర్వదినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విధాత తన సృష్టి కార్యకలాపాలను సాగిస్తూ కాల చక్రమును నిర్ణయించాడు. ఆ కాల చక్రంలో సంవత్సరాల పేరుతో ప్రభవ నుండి అక్షయ వరకూ సంవత్సరాలు అనీ, ఉత్తరాయణం దక్షిణాయనమనే రెండు అయనాలనూ, పాడ్యమినుండి పౌర్ణమి అమావాస్యల పేరుతో పదిహేను తిథులనూ, అశ్విని నుండి రేవతి వరకుగల 27 నామాలతో నక్షత్రములుగా, వసంతం నుండి శిశిరం వరకుగల ఏడింటిని వారములుగా, చైత్రం నుండి ఫాల్గుణం వరకు గల పనె్నండింటిని తెలుగు మాసాలుగా, శుక్లము - కృష్ణము అను రెండింటిని పక్షములుగా, సౌరమానం- చాంద్రమానం అంటూ రెండు సూర్య చంద్రుల పరంగా కాల విభజన జరిగింది.
నక్షత్ర గమనాన్ని అనుసరించి సృష్టి ప్రారంభమైన దినమే ఉగాది అయి పర్వదిన శోభను సంతరించుకొన్నది. మాసాల్లో మొదటిది చైత్రము. పక్షములలో ప్రథమం శుక్లపక్షము. ఋతువులలో ఆరంభం వసంతంగాన చైత్రశుద్ధ పాడ్యమి.
కాలచక్రం ఎంతో మహనీయమైనది. కలియుగంలో - కలికాలంలో ఉత్తమమైన మానవ జన్మ సార్థకతకు, సుఖశాంతులతో సంతృప్తిగా జీవించుటకు ఎంతో జ్ఞానం కలగాలి. సుజ్ఞానంతో వెలగాలి. భగవత్ ప్రసాదమైన మానవ జన్మ లక్ష్యం తెలుసుకోవటంలో, గమ్యాన్ని చేరుకోవటంలో కాలానుగుణంగా ఋషులు మహనీయులు నిర్ణయించిన సంప్రదాయాలను పాటించాలి. మానవులు విజయపథంలో పయనించడానికి కాలాన్ని అనుసరించి మెలగాలి. ఇది ఆర్ష సంప్రదాయం. ధర్మసూక్ష్మాల సారం. కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మలు ఆచరించాలి. ఏ ఏ సమయంలో ఏ కార్యాలు సక్రమంగా నిర్వహించాలో శాస్త్రాలు నిర్దేశించాయి.
కాలాన్ని సద్వినియోగపరచుకొంటూ- కర్తవ్య నిర్వహణ కావించేవారే విజ్ఞులు. కావున కాల స్వరూప స్వభావాల జ్ఞానమును తెలిసికొని ఆచరణలో చూపాలి. ఈ భూమిపై జరిగే సమస్త కర్మలకు ప్రత్యక్ష సాక్షి కాలం. ప్రపంచంలోని ప్రతి జీవి కాలాధీనమై మెలగవలసిందే. కాలం అమేయం అమోఘం. సమస్త జీవుల జీవన గతిని- గమనాలను నిర్దేశించేది కాలమే. కాలం భగవత్ స్వరూపం. గీతలో భగవానుడు అహమేవ అక్షయ కాల అన్నారు. పరమేశ్వర స్వరూపమైన కాలం అఖండమైనది. కార్య స్వరూపంచతక్షణాలు - ఘటికలు - దినములు మొదలైనవి కర్మాచరణ నిమిత్తం ఏర్పడినవి సంకల్పములు. వీటిలో ప్రధానమైన భేదాలు ఆరు. అవి సంవత్సరం- అయనం- ఋతువు- మాసం- పక్షం- రోజు. వీటిని గణన చేయడానికి ప్రమాణికంగా సంవత్సరమును ఐదు రకాల మానాలుగా చూపించారు ఆచార్యులు. అవి చాంద్రమానం - సౌరమానం - సావనమానం- నక్షత్రమానం - బార్హస్పత్యమానం.
కాలమహిమను అధర్వణ వేదంలో ఇలా తెలిపారు. ఐదు విధములైన మాసములను శుక్లపక్ష అమావాస్య మొదలు కృష్ణపక్ష పాడ్యమి వరకు గల ఒక మాసం. ఇవి చైత్ర - వైశాఖాది పేర్లుగల 12 నెలలు. 354 రోజులు. అధిక మాసాలు వస్తే సంవత్సరానికి 13 అవుతాయి. ఈ చాంద్రమాన సంవత్సరాలకే ప్రభవ నుండి అక్షయ వరకు అరవై పేర్లు వాడుతున్నాం. చంద్రుని పెరుగుదల- తిరిగి తరుగుదల ఆధారంగా ఒక మాసం రోజులను లెక్కించడమే చాంద్రమాన రీతి. పౌర్ణమినాడు ఉండే నక్షత్రాన్ని లెక్కగా తీసికొని ఆ మాసానికి ఆ పేరుగా నిర్ణయించారు. ఉదాహరణకు శ్రవణం నక్షత్రంతో కూడిన పౌర్ణమిగల మాసమును శ్రావణ మాసమని అన్నారు.
కాలమానంలో తిథి వార నక్షత్రములతోబాటు యోగం - కరణం అనే వాటిని కలిపి పంచాంగం అంటారు. ఐదు అంగములు రవి చంద్రుల కలయికయే యోగం అనబడుతుంది. విష్కంభాది 27 యోగములను వరుసగా నిర్ణయించారు. చంద్రగతిననుసరించి బవాది 11 కరణాలు వరుసగా తిథిలో సగభాగం లెక్కిస్తారు. మానవులు తమ జీవన కాలంలో శుభ తిథిని ఎన్నుకొని పనులను ప్రారంభిస్తే సంపద- ఆయుష్షు- పుణ్యము- వ్యాధి నివారణం- యిష్టకామ్య సిద్ధి లభిస్తాయనీ పంచాంగంలో జ్యోతిషశాస్తవ్రేత్తలు ఈ విషయాలను విపులంగా వివరించి లోకానికందించి - పండితులచే పఠింపజేసి ఉగాది పర్వదిన సందర్భంగా సకల జనులూ శ్రవణం చేసి తరించాలనీ, భవిష్యత్తును సుఖమయం చేసుకోవాలనీ తెలియజేయుట కాలప్రభావం. కాలము యొక్క విశిష్టత.

-పి.వి.సీతారామమూర్తి 9490386015