Others

లోకమ్మే ఏకమ్మై చేసె రామభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ పాటను అతివలపుడు- అందుకొంచు పాడిరి
ఆడుచు పాడుచు అతివలు ఆనందమునందిరి

ఒక సూర్యుని చుట్టునెన్నొ గ్రహములు తిరుగాడినట్లు
ఒక చుక్కను చుక్కలెన్నొ చుట్టుముట్టె నన్నట్టుల

నీహారికలే హారతులివ్వదొడిగె నన్నట్టుల
పాలపుంతలే ముంతల పాల గ్రుమ్మరించినటుల

పాలు కురిసె, పూలు కురిసె, కురిసెను ఆనందం
విశ్వమ్మే తన్మయత్వ భావమ్మున విరిసెను
వచనం- ఆపై అందరూ సేదదీరాక
వారితో హనుమ ఇలా అన్నాడు.
ప్రాశస్త్యం
హనుమ:
రామాయణ కథ వినుటకు వలయు నెవరిసాయం?
గుండెలయల వినంబడెడు నాదమె రామాయణం!

అణువణువున వ్యాపించిన తత్త్వమె రామాయణం!
వేదమ్ములు ఘోషంచెడి నాదమె రామాయణం!

ఉడతనడుగు! బుడతనడుగు! నుడువును రామాయణం!
రాయినడుగు! రప్పనడుగు! పాడును రామాయణం!

కన్నుల వెలుగుల వెలిగెడు వెలుగే రామాయణం!
చెవులయందు సుడులు తిరుగు నుడులే రామాయణం!

ఇంకావుంది...
*

- గన్ను కృష్ణమూర్తి, 9247227087