Others

గోడ మీద చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత అందమైన జీవితమో
ఎంత బాగా జీవించారో
అన్నట్టు ఉంటుంది ప్రశాంత వదనం..

ఎవరికి తెలుసు ఆ తేజస్సు
ఒక్క నిమిషానిదేనని
చీకటిని దాటిన వెనె్నల వెలుగులన్నీ
విచ్చుకున్న నవ్వుల పువ్వులన్నీ
అక్కడే కురిశాయనీ
వెల్లి విరిసాయని
అర క్షణపు ఆనంద హేలయని!

మరుక్షణం అంతా మామూలే
గది నిండిన భావోద్వేగాలు
మదినిండా అంతర్లీన ఆలోచనలు
అలుపెరుగని కష్టనష్టాలు
ఖాళీ చేయబడ్డ జీవితం
తరచి చూస్తే ఏకాంతం
ఒంటరిని చేసిన అనుబంధాలు!

యుగాలుగా దాటేస్తూ
తరాలుగా తిరగేస్తూ
అదే కథగా జీవితాలను నడిపిస్తూ
మిగిలిపోయిన గోడమీద చిత్రాలుగా
ఒంటరిగా వేలాడుతూ...

వెలిసిపోయన వర్ణమే ఇది
విధికి తలొంచి సాగిపోయిన చరితలో...

- స్వప్న మేకల, 9052221870